తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క కి ఎంతో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి... స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో హవా నడిపించింది.  కొత్త హీరోయిన్ లు వచ్చిన తనకు ఎదురు లేదు అని నిరూపించింది.  స్టార్ హీరోలందరికీ సినిమాల్లో కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అనుష్క శెట్టి. ఇక ఆ తర్వాత ఓ ప్రయోగాత్మక సినిమాతో సినిమాలకు దూరమైన... మళ్లీ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది అనుష్క శెట్టి. అనుష్క ఎలా ఉన్నా ప్రేక్షకులు మాత్రం ఆదరిస్తే ఉన్నారు. బాహుబలి తర్వాత వచ్చిన భాగమతి సినిమా లో  తనదైన యాక్టింగ్ తో అదరగొట్టి  విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. 

 

 ఇక తాజాగా నిశ్శబ్దం  అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే కథాంశంతో నిశ్శబ్దం సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్  ఎంతో ప్రేక్షకుల ఆదరణ పొందుతూ మరెన్నో ప్రశంసలు అందుకుంటోంది. అయితే నిన్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క కెరియర్ ని బాగా బిల్డప్ చేసిన రాజమౌళి కూడా ఈ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. 

 

 ఇక ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి... అనుష్క గురించి పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. అనుష్క ఏ పాత్ర ఇచ్చినా 100% కష్టపడి నటిస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. నిశ్శబ్దం సినిమా ట్రైలర్ చూశానని ఎంతో బాగుంది అంటూ రాజమౌళి చెప్పాడు. ఇక అనుష్క ఎన్నో ఏళ్ల నుంచి తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ చెప్పిన రాజమౌళి పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు. అనుష్క తనతో ఎంతో క్లోజ్ గా ఉంటుందని.. అనుష్క తనతో మాత్రమే ఇంత క్లోజ్ గా  ఉంటుంది అని నేను అనుకునే వాడిని అంటూ చెప్పుకొచ్చిన  రాజమౌళి... తన కుటుంబంలోని అందరి తో అనుష్క అంతే క్లోజ్ ఉంటుంది అని తర్వాత తెలిసింది అంటూ తెలిపాడు. ఆ తర్వాత ఈ విషయం తెలిసి ఎంతో షాకయ్యాను అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: