సూప‌ర్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన భామ అనుష్క‌. అక్కినేని నాగార్జున‌కు జోడిగా న‌టించి సూప‌ర్ అనిపించుకున్న ఈ భామ త‌ర్వాత చాలా చిత్రాల్లో న‌టించింది. అయితే `అరుంధ‌తి`కి ముందు వ‌ర‌కు త‌ను న‌టించిన పాత్ర‌ల‌న్నీ ఒక ఎత్తు అయితే..కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌`అరుంధ‌తి` చిత్రం ఒక ఎత్తు అని చెప్పాలి. అప్ప‌టి వ‌ర‌కు కూడా ఆమె అన్నీ క‌మ‌ర్షియ‌ల్ హంగులున్న చిత్రాల్లోనే న‌టించింది. విక్ర‌మార్కుడు, సౌర్యం, బిల్లా ఇలా ఎన్ని చిత్రాల్లో న‌టించినా ఏదో ప‌ర్వాలేద‌నిపించుకుంది కానీ ఇంత పెద్ద పేరు మాత్రం రాలేదు. అయితే అప్పటి వ‌ర‌కు త‌ను చేసిన పాత్ర‌ల‌న్నీ కూడా అంద‌రూ చేసిన‌వే క‌న‌ప‌డుతున్నాయి. త‌ప్పించి ప్ర‌త్యేకంగా ఆమె న‌టించిన‌వి ఏమీ లేదు.

 

మిగ‌తా హీరోయిన్ల‌కి ఆమెకు పెద్ద‌గా తేడా ఏమీ క‌నిపించ‌లేదు. ఇక ఆఖ‌రికి సౌంద‌ర్య లాంటి వెట‌ర‌న్ హీరోయిన్ అయినా స‌రే అరుంధతి లోని జెజెమ్మ పాత్ర‌ను న‌టించ‌లేదు. అంత‌టి పాత్ర‌కి ఆ ఆహార్యం ఆ అందం అభిన‌యం ఆ క‌త్తి ఒడుపు అవ‌న్నీ అనుష్క‌కే సాధ్య‌మయ్యాయ‌ని అంద‌రూ అంటుంటారు. దాంతో అరుంధ‌తి వ‌ర‌కు ఆమె ఎన్ని చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఆశించినంత పేరు ప్ర‌ఖ్యాత‌లు మాత్రం ఆమెకు రాలేదు.

 

కేవ‌లం ఆ ఒక్క‌చిత్రంతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌లాగా జేజ‌మ్మ పాత్ర‌లో ఉన్న ప‌వ‌ర్ అలాంటిది. అందులో సోనూసూద్‌కి ధీటుగా న‌టించి అత‌న్ని క‌త్తితో పొడిచి చంపి ఒక స‌మాధి క‌ట్టి అందులో బ్ర‌తికి ఉండ‌గానే పూడ్చిపెట్టే సీన్ ఇప్ప‌టికీ క‌ళ్ళ‌కు క‌ట్టినట్టు ఉంటుంది. అలాగే ఆమె జేజ‌మ్మ‌గా ఊరి క‌ష్టాన్ని త‌న మీద వేసుకుని త‌న ప్రాణాన్ని సైతం ప‌ణంగా పెట్టి ఓ పూజ‌లో ఆమె త‌ల‌మీద వంద కొబ్బ‌రికాయ‌లు కొట్టించుకుని ప్రాణాన్ని అర్పిస్తుంది. బొమ్మాళి నిన్ను వ‌ద‌ల బొమ్మాళి అన్న పాత్రకి క‌రెక్ట్ గా సూట్ అవుతుంది. అందులో క‌త్తి ప‌ట్టిన‌ప్పుడు సోనూసూద్ మీద ఆమె చూపించే రౌద్రం ఆమె ముఖ క‌వ‌ళిక‌లు అత్యద్భుతంగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: