అందానికి  మరియు  అద్భుతమైన అభినయానికి కేరాఫ్ అడ్రస్ అనుష్క..ఇలాంటి బంగారు తల్లిని మనకి పరిచయం చేసింది డైరెక్టర్ పూరి జగన్నాధ్.. సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి నిశబ్దం దాక సినీ ప్తస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది మన స్వీటీ. అసలు అనుష్క యోగ ట్రైనర్.. ఇప్పటికి అనుష్క హీరోయిన్ గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి 15 సంవత్సరాలు అయింది..

 

అయితే అనుష్క గూర్చి డైరెక్టర్ పూరి జగన్నాద్ ఏమన్నారంటే..  ఈ బంగారుత‌ల్లి ‘సూప‌ర్’ సినిమా హీరోయిన్ కోసం బాంబే వెళ్లిన‌ప్పుడు నాకు దొరికింది. అందులో సెకండ్ హీరోయిన్. ఫుల్ గ్లామర్ పాత్ర. తరువాత అన్న‌పూర్ణ స్టూడియోస్‌కి తీసుకెళ్లాను. నాగార్జున‌గారు త‌న‌ను చూడ‌గానే, ‘ఈ అమ్మాయ్ చాలా బాగుందే’ అన్నారు. ‘ఈ అమ్మాయికి ఆడిష‌న్ చేద్దాం సార్’ అన్నాను. ‘ఆడిష‌న్ ఏమీ అవ‌స‌రం లేదు, పెట్టేద్దాం’ అని ఆయ‌న‌న్నారు.

 

అన్న‌పూర్ణ స్టూడియోలోనే వినోద్ బాల ద‌గ్గ‌ర త‌ను యాక్టింగ్ నేర్చుకుంది. డాన్స్ అవీ నేర్చుకొని సూప‌ర్ ఎన‌ర్జీతో ‘సూప‌ర్’ ఫిల్మ్‌లో చేసింది.అదరగొట్టింది. అయితే అసలు అనుష్క కి పేరు పెట్టింది నాగార్జున గారట.ఒకసారి నాగార్జున‌గారు నీ పేరేంట‌ని అడిగితే స్వీటీ అని చెప్పింది. ‘కాదు, నీ ఒరిజిన‌ల్ పేరు?’ అన‌డిగారు. స్వీటీయేన‌ని, త‌న పాస్‌పోర్ట్ చూపించింది. అందులో ఆ పేరే ఉంది. ‘ఇలా కాదు, స్క్రీన్ నేమ్ మంచిది ఉండాలి’ అన్నారు నాగార్జున‌గారు. ఆ త‌ర్వాత ఈ పిల్ల‌కు ఏం పేరు పెడ‌దామ‌ని చాలా పేర్లు రాసుకున్నారట.

 

అప్ప‌డు మ్యూజిక్ డైరెక్ట‌ర్ సందీప్ చౌతా ‘మిల మిల’ అనే పాట రికార్డింగ్ కోసం ఒక అమ్మాయిని పిలిపించాడు. ఆ అమ్మాయి పేరు అనుష్క‌. అది నాకు న‌చ్చి, ‘ఈ పేరు ఎలా ఉంది?’ అని స్వీటీని అడిగాను. ‘బాగానే ఉంది కానీ, నాగార్జున‌గారిని కూడా అడుగుదాం’ అంది. ఆయ‌న్ని అడిగితే, మ‌న హీరోయిన్ల‌లో ఎవ‌రికీ ఇలాంటి పేరు లేదు, పెట్టేయొచ్చ‌న్నారు. అలా అనుష్క అనే నామ‌క‌ర‌ణం జ‌రిగింది.తర్వాత నాగార్జునతో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి అనుష్క పెట్టింది పేరు. అమ్మ బొమ్మాలి నువ్వు సూపర్ తల్లి అంటారు అందరు.  ‘సూప‌ర్‌’తో స్టార్ట‌యి, ‘నిశ్శ‌బ్దంతో ప‌దిహేనేళ్ల కెరీర్ పూర్తి చేసుకుంటోంది. యు రాకింగ్‌, ల‌వ్ యు.. హ్యాట్సాఫ్‌ అని అన్నారు.

 

 అందరు చెప్తున్న‌ట్లే అనుష్కనిజంగా చాలా మంచిది. త‌న ద‌గ్గ‌ర చాలా విష‌యాలు నేర్చుకోవాలి. ర‌వితేజ‌, చార్మి, నేను అనుష్క‌ను ‘అమ్మా’ అని పిలుస్తాం. మేం క‌లిసిన‌ప్పుడ‌ల్లా త‌న కాళ్ల‌కు దండంపెట్టి ఆశీర్వాదం తీసుకుంటాం. ఆమెలో కొన్ని ల‌క్ష‌ణాల‌న్నా మాకు రావాల‌ని కోరుకుంటుంటాం. చాలా మంచిత‌నం, చాలా తెలివితేట‌లు క‌లిసిన కాంబినేష‌న్ అనుష్క‌.

 

నా స్నేహితుడు హేమంత్ మ‌ధుక‌ర్ తీసిన ‘నిశ్శ‌బ్దం’ సినిమాను నేనిప్ప‌టికే చూశాను. ఫెంటాస్టిక్ ఫిల్మ్‌. అనుష్క‌ మూగ‌మ్మాయిలా చేసింది. నిజంగా మూగ‌దేమో అని నాకే డౌట్ వ‌చ్చింది. ఈ అమ్మాయి ‘తెలీదు తెలీదు’ అని అన్నీ నేర్చుకొనే ర‌కం. త‌న‌కు హ్యాట్సాఫ్‌. ఈ సినిమా పెద్ద హిట్ట‌వ్వాలి అనుష్కా” అని చెప్పారు పూరి జగన్నాద్. ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తోంది.  సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: