మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తుండటం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని తెరకెక్కిస్తుండటం ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలలోను హాట్ టాపిక్ గా మారింది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకోసం మహేష్ బాబు 40 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. అయితే మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద హాట్ న్యూస్ గా వైరల్ అవుతోంది. 40 కోట్ల రెమ్యూనరేషన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా సినిమా కాబట్టి అది అంత భారీ రెమ్యూనరేషన్ ఏమీ కాదన్న మాట కూడా వినిపిస్తుంది. 

 

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ని అందుకున్నారు. అయితే మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు, భరత్ అనే నేను ..రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు రెండు, ఎన్.టి.ఆర్ కి జనతా గ్యారేజ్, ప్రభాస్ కి మిర్చి సినిమా బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చాడు. దాంతో స్టార్స్ తో తీసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ అవడం తో కొరటాల టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత మళ్ళీ అలా వరుసగా హిట్ సినిమాలు తీస్తున్న సూపర్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు.

 

అందుకే కొరటాల కి మెగాస్టార్ చిరంజీవి మంచి ఆఫర్ ఇచ్చారు. దాంతో కొరటాల చిరు కోసం దాదాపు రెండేళ్ళు వేయిట్ చేసి మరి ఈ తాజా చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు నటించడానికి 25 రోజులు డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సోలో గా స్టార్స్ ని డైరెక్ట్ చేసి బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న కొరటాల ఇప్పుడు ఒకేసారి మెగాస్టార్ చిరంజీవి, సూపార్ స్టార్ మహేష్ బాబు ని డైరెక్ట్ చేస్తుండటంతో కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారట. ఇలా ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలని డైరెక్ట్ చేయడం సాహసం, పెద్ద రిస్క్ ఏమో .. ఇప్పటి వరకు అన్ని బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నారు.

 

మరి ఈ సారి అది సాధ్యమేనా అంటు అనుమానాలని వ్యక్తపరుస్తున్నారట. ఈ కామెంట్స్ కొరటాలని చాల్లా హర్ట్ చేశాయట. దాంతో కొరటాల ఇప్పటి వరకు నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చా .. నా సత్తా ఏంటో తెలిసి కూడా ఇప్పుడు ఇలా మాట్లాడతారా .. అయితే చిరు, మహేష్ సినిమా మీరే డరెక్ట్ చేసుకోండి .. నేను డ్రాపవుతా ..అంటూ కొరటాల రివర్స్ లో పంచ్ వేశారట. మరి అంతే కదా ఇద్దరు స్టార్ హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ నమ్మినప్పుడు వీళ్ళకేంటి నొప్పి అంటూ కొరటాలకి సపోర్ట్ చేస్తున్నారట ఫ్యాన్స్. 

మరింత సమాచారం తెలుసుకోండి: