ప్రస్తుతం బుల్లితెరపై మంచి క్రేజ్ తో పాటు ఫాలోయింగ్ తో కొనసాగుతున్న యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు ఒకింత ముందు వరుసలో ఉంటారు అనే చెప్పాలి. ముందుగా కొన్ని ఛానల్స్ లో అక్కడక్కడా కొన్ని షోస్ లో పని చేసిన ప్రదీప్ , ఆ తరువాత స్టార్ మహిళ, అదుర్స్, ఢీ జోడి, గడసరి అత్త సొగసరి కోడలు, ప్రదీప్ పెళ్లిచూపులు, కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను, డ్రామా జూనియర్స్ తదితర షోలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తరువాత అత్తారింటికి దారేది, 100%లవ్, జులాయి, రామయ్య వస్తావయ్యా తో పాటు మరికొన్ని సినిమాల్లో అక్కడక్కడా చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఇక ప్రస్తుతం యువత తో పాటు అమ్మాయిల్లో కూడా ప్రదీప్ కు ఎంతో మంచి పేరు ఉందనే చెప్పాలి. 

 

ఇకపోతే ఒకానొక సమయంలో స్టార్ మా ఛానల్ లో జరిగిన ప్రదీప్ పెళ్లి చూపులు షోలో విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరి, ప్రదీప్ ని పెళ్లిచేసుకోనుందని కొంత వార్తలు వచ్చాయి. అంతటితో ఆగకుండా మరికొందరు అయితే వారిద్దరికీ పెళ్లి జరగడంతో పాటు విడాకులు కూడా అయ్యాయని, వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారని కూడా మరింతగా ప్రచారం చేసారు. అయితే అవేవి నిజం కాదని, మధ్యలో ప్రదీప్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ విషయమై మధ్యలో జ్ఞానేశ్వరి కూడా అది వాస్తవం కాదని మధ్యలో కొన్ని సందర్భాల్లో వెల్లడించడం జరిగింది. అయితే అసలు ఇదంతా నిజమా, కాదా అనే దానిపై ఇప్పటికీ కూడా కొందరు ప్రేక్షకుల్లో సందిగ్ధత మాత్రం ఇంకా నెలకొని ఉందనే చెప్పాలి. ఇక ఇటీవల ఒక వారం రోజుల క్రితం, ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో జ్ఞానేశ్వరి మాట్లాడుతూ, ముందుగా పెళ్లిచూపులు షోలో తాను అసలు విన్ అవుతానని అనుకోలేదని, దేవుడి దయవల్ల, మా అమ్మ నాన్నల ఆశీర్వాదం వల్ల గెలిచానని ఆమె అన్నారు. 

 

ఇక ఆ షో పూర్తి అయిన తరువాత మీరు ప్రదీప్ ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ తన పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ కి రోజూ వేలాదిగా మెసేజెస్ వచ్చేవని, అయితే అదంతా షోలో భాగంగా జరిగిందేతప్ప నిజం కాదని, తాను ఎంత చెప్పినా చాలా మంది నెటిజన్లు వినేవారు కాదని, అదీకాక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ఆ వార్త ప్రచారం అవడంతో చాలామంది అది నిజం అని నమ్మరని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. షో ముగిసిన తరువాత ప్రదీప్ తో మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని, అయితే లైఫ్ లో ఎటువంటి సంఘటనలు జరిగినా ఎప్పుడూ సహనం, ఓర్పుతో వ్వవహరిస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం అనే గొప్ప మాట ప్రదీప్ తనకు చెప్పారని ఆమె అన్నారు. ఇక ఆ విధంగా మా మధ్య ప్రేమ, పెళ్లి విషయమై ప్రచారం అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, దయచేసి ఇకనైనా అటువాంటిని నమ్మవద్దని ఆమె ప్రజలను కోరారు. ఇటీవల రెండు వెబ్ సిరీస్ లో నటించిన తాను, ఇకపై భవిష్యత్తులో నటిగా మంచి స్థానాలకు ఎదగాలని గోల్స్ పెట్టుకున్నట్లు చెప్పారు జ్ఞానేశ్వరి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: