అనుష్క పేరు వింటే ఎవరికన్నా ముందు గుర్తుకువచ్చేది అరుంధతి సినిమా. ఈ సినిమాలతో బాగా పాపులర్ అయింది. లేడీ ఓరియెంటెడ్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది అనుష్క. దాదాపు సినీ ఇండస్ట్రీ లో అందరి హీరోలతో జంటగా నటించింది. అయితే ఇప్పుడు అందరికి అనుష్క పెళ్లి గూర్చే బెంగగా ఉంది. ఎవరిని పెళ్లిచేసుకుంటుందో అని.

 

ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ హీరోయిన్స్ లో అనుష్క ఒకటి. ఎక్కడికి వెళ్లిన అనుష్క పెళ్లి గూర్చి అడుగుతున్నారట. అయితే అనుష్క ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 సంవత్సరాలు అవుతుంది అని ఒక ఫంక్షన్ చేసారు. అతిరధ మహారధులు ఈ ఫంక్షన్ కి వచ్చారు. ఆయితే అనుష్క పెళ్లి గూర్చి స్పందించి వివరణ ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజమో? ఏది వదంతో తెలియడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. “నా వివాహం గురించి గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అలాంటి పుకార్ల వలన నేను ఇబ్బందిపడను. కానీ నా కుటుంబసభ్యులు బాధపడుతున్నారు.

 

నా పెళ్లి గురించి అందరూ ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. బంధాలను ఎవరూ దాచలేరు. అలాగే నా పెళ్లి విషయాన్ని నేనేందుకు దాస్తా. ఇది చాలా సున్నితమైన విషయం. అందరూ దీన్ని సున్నితంగానే చూడాలి. నా వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు చొరబడితే నాకు నచ్చదు. వివాహం అనేది చాలా పవిత్రమైంది. పెళ్లి జరిగిన రోజు తప్పుకుండా అందరికీ తెలుస్తుంది. ఎవర్ని పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని నేను బయటకి చెప్పకపోవచ్చు. కానీ వరుడి గురించి నన్ను డైరక్ట్‌గానే అడగొచ్చు. వారికి నేను సమాధానం చెప్తా.

 

అయినా నా పెళ్లి విషయాన్ని మా తల్లిదండ్రులకే వదిలేశా. కచ్చితంగా పెద్దలు కుదిర్చిన పెళ్లినే చేసుకుంటా అని స్పష్టం చేశారు. పేరెంట్స్ ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా అని తేల్చి చెప్పింది. నా మీద వచ్చిన రూమర్స్ అని అబద్దం అని, మేమందరం స్నేహితులం మాత్రమే అని చెప్పింది. ఇంకా ఎంత కాలం ఆగాలో పెళ్ళికి. 

మరింత సమాచారం తెలుసుకోండి: