హేయ్ పిచ్చ.. నా పెళ్లి గురించి మీకెందుకు? ఈ మాట అనుష్క డైరెక్ట్ గా అనలేదు కానీ ఇండైరెక్ట్ గా మాత్రం ఇదే అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఏమైంది ? ఈ వార్తలు ఏంటి అనుకుంటున్నారా? అదేనండి అనుష్క పెళ్లి గురించి వార్తలు ఎలా వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

పూటకు ఒకరితో పెళ్లి సంబంధం అంటగట్టి యూట్యూబ్ లో గాసిప్ లు నడుస్తూనే ఉన్నాయి.. ఇక ఆ గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల చిన్న పత్రికల నుండి ప్రముఖ పత్రికల వరుకు ప్రతి ఒక్కరు ఆ వార్తలు రాస్తారు.. చిన్న చితక పత్రికలు అయితే పెళ్లి ఫిక్స్ అయ్యింది అని రాస్తారు.. ప్రముఖ పత్రికలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అని రాస్తారు. 

 

ఎందుకంటే అనుష్క పెళ్లి అనే అంశం ఎప్పటికి ట్రేండింగ్ అంశమే కదా! ఇక పోతే ఈ భామకు పెళ్లి అని.. ఓ స్టార్ హీరోతో పెళ్లి అని.. క్రికెటర్ తో పెళ్లి అని.. వ్యాపారవేత్తతో పెళ్లి అని.. నిర్మాతతో పెళ్లి అని.. చివరికి స్టార్ డైరెక్టర్ కొడుకుతో కూడా పెళ్లి అని వార్తలు రాసి ఓ రేంజ్ ట్రెండ్ చేశారు. అయితే ఆ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

 

దీంతో ఈ వార్తలు అన్ని అనుష్కకు.. ఆమె కుటుంబానికి తెలిసి చాలా బాధపడ్డారు అంటే నమ్మండి.. పాపం.. ఈ మేరకే ఆమె ఇది వరుకు ఓ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ''నా వివాహం గురించి గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అలాంటి పుకార్ల వలన నేను ఇబ్బందిపడను. కానీ నా కుటుంబసభ్యులు బాధపడుతున్నారు. నా పెళ్లి గురించి అందరూ ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. బంధాలను ఎవరూ దాచలేరు. అలాగే నా పెళ్లి విషయాన్ని నేనేందుకు దాస్తా. 

 

ఇది చాలా సున్నితమైన విషయం. అందరూ దీన్ని సున్నితంగానే చూడాలి. నా వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు చొరబడితే నాకు నచ్చదు. వివాహం అనేది చాలా పవిత్రమైంది. పెళ్లి జరిగిన రోజు తప్పుకుండా అందరికీ తెలుస్తుంది. ఎవర్ని పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని నేను బయటకి చెప్పకపోవచ్చు. కానీ వరుడి గురించి నన్ను డైరక్ట్‌గానే అడగొచ్చు. వారికి నేను సమాధానం చెప్తా. అయినా నా పెళ్లి విషయాన్ని మా తల్లిదండ్రులకే వదిలేశా. కచ్చితంగా పెద్దలు కుదిర్చిన పెళ్లినే చేసుకుంటా'' అని ఆమె గతంలోను.. ప్రస్తుతం రెండు సార్లు స్పష్టం చేశారు.

 

కానీ ఫేక్ వార్తలు.. గాసిప్స్ రాసేవారు ఆగారు కదా స్వీటీ.. అందుకే త్వరగా పెళ్లి చేసుకో.. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది.. మళ్లీ లేట్ చేస్తే ఎలా చెప్పు.. ఆ ఫేక్ వార్తలు ఆగాలి అంటే త్వరగా పెళ్లి చేసుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి అందాల ముద్దుగుమ్మ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: