రాజకీయం అంటే సీఎం జగన్ చేసేదో.. మాజీ సీఎం చంద్రబాబు చేసేదో కాదు.. ప్రతి చోటా రాజకీయం అనేది నడుస్తుంది.. సత్తా ఉన్నవాడు రాజు అవుతాడు.. మిగితా అందరిని గుప్పెట్లో పెట్టుకుంటాడు. ఈ తరహా రాజకీయం ప్రతి చోటా నడుస్తుంది. ఇకపోతే ఇప్పుడు టీవీ ఛానళ్ల ముందు ఎప్పుడు జరిగే రాజకీయం వేరు.. అదే టిఆర్పీలో ''నెంబర్ 1'' రాజకీయం. 

 

ఇక పోతే.. ఎంటర్టైనింగ్ విషయానికి వస్తే.. ఒకో ఛానల్ కు ఒకోవిదమైన గ్రేట్ నెస్ ఉంది.. 'స్టార్ మా' సీరియల్స్ ఏమో మంచి లీడ్ తీసుకొని.. అందులో ట్విస్ట్ లు ఇచ్చుకుంటూ.. షాక్ లు ఇస్తూ ఆ సీరియల్స్ ను ఒక 5 లేదా 6 సంవత్సరాలు నడిపేస్తుంది.. ఇక ఈ స్టార్ మా లో ప్రోగ్రామ్స్ వచ్చినప్పటికీ అవి 3 నెలలు లేదా 6 నెలలు బాగా అలరించి క్లోజ్ అవుతాయి.. ఇంకా అప్పుడప్పుడు ఏవైనా కొత్త సినిమాలు వీకండ్స్ కు వస్తుంటాయి. ఇది స్టార్ మా తెలివి.. 

 

ఈ టీవీ.. ఈ ''ఈ టీవీ'' ఛానల్ గురించి ఎం అని చెప్పేది? ఎంత అని చెప్పేది? ఈ ఛానల్ లో ఒక సీరియల్ 10 సంవత్సరాలకు పైనే నడుస్తుంది.. కొన్ని కొన్ని సీరియల్స్ అయితే 15 సంవత్సరాలు కూడా నడుస్తాయి. ఇక ''ఈ టీవీ'' సీరియల్స్ కు కూడా చాలామంది వృద్దులు ఫ్యాన్స్ ఉన్నారు.. వల్లే చూస్తుంటారు... ఇక ఈ టీవీ సీరియల్స్ చూసేవాళ్ళు మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కానీ ఈటీవీ లో సీరియల్స్ కు లేని డిమాండ్.. ఈటీవీ లో వచ్చే ప్రోగ్రామ్స్ కు ఉంటుంది.. ఈటీవీ ప్రోగ్రామ్స్.. ఢీ.. జబర్దస్త్.. క్యాష్.. స్టార్ మహిళా వంటివాటికి మంచి డిమాండ్ ఉంది అంటే నమ్మండి. ఈటీవీ మొత్తం కూడా ప్రోగ్రామ్స్ పైనే నడుస్తుంది అని టాక్. ఇంకా ఈటీవీ లో కొత్త సినిమాలు రావడం అనేది ఒక కల.. 

 

జీ తెలుగు.. ఇది పైన చెప్పినట్టు స్టార్ మా లా సీరియల్స్ అద్భుతం కాదు.. ప్రోగ్రామ్స్ అద్భుతం కాదు. ఈ ఛానల్ పై చాలామంది ప్రజలకు కాపీ ఛానల్ అని అంటుంటారు.. ఎందుకు అంటే? స్టార్ మా లా సీరియల్స్ తియ్యాలని చూస్తుంది.. ఈటీవీ లా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తుంది అని.. ఈ ఛానల్ లో వచ్చే సీరియల్స్ మొదట 2 సంవత్సరాలు సూపరో సూపరు అని అనిపించినా చివరికి ఆ సీరియల్స్ ను అల్లకల్లోలం చేస్తారు అని సీరియల్ చూసే బాధితులు బాధపడుతున్నారు. ఇంకా ప్రోగ్రామ్స్ అయితే ఎక్కువ కాలం ఏమి రావు.. అలా అని స్టార్ మా లా తక్కువ కాలము రావు. అలా అలా కొనసాగుతుంటాయ్ అంతే. 

 

ఇక మనం టైటిల్ లో చెప్పుకున్నట్టు.. జెమినీ టీవీ విషయానికి వస్తే.. ఒక 15 ఏళ్ళ క్రితం జెమినీ టీవీ సూపర్. అందులో వచ్చే చక్రవాకం.. మొగలిరేకులు.. ఇలా మంజుల నాయుడు తీసిన సీరియల్స్ పుణ్యమా అని మంచి స్టేజిలో ఉండే.. అలాంటిది ఇప్పుడు ఈ ఛానల్ చివరి రేటింగ్ లో ఉంది. అందుకే జెమినీ టీవీ పెద్ద రిస్క్ ఏ తీసుకుంటుంది.. కార్తీకదీపం లాంటి సీరియల్ కు పోటీగా పిన్ని అనే పాత సీరియల్ ను పిన్ని 2 తో రాధికాతో తీస్తున్నారు. నాగిని 1, 2, 3 ఇలా అన్ని అయిపోయి ఇప్పుడు నాగిని 4 తెరమీదకు రానుంది..

 

అమ్మ కోసం అనే కొత్త సీరియల్ కూడా తెరపైకి వస్తుంది అనుకోండి.. అది వేరే విషయం. ఇక్కడ అన్నిటికంటే పెద్ద విషయం ఏంటి అంటే.. ఫిబ్రవరి నుండి జెమినీ టీవీలో నాలుగు కొత్త ప్రోగ్రాం లు.. కొత్త సీరియల్స్ వస్తున్నాయి. అయితే ఏ సీరియల్ చుసిన ఈటీవీ.. స్టార్ మా, జీతెలుగు నటులే కనిపిస్తున్నారు. అక్కడ ఎలా అయితే మంచి రేటింగ్ వచ్చిందో ఇక్కడ అలాగే రావాలి అని చేస్తున్నారో తెలియటం లేదు మరి ఇంకేమైనా విషయమో తెలియటం లేదు కానీ మంచి మంచి స్టార్స్ అందరిని కూడా ఇక్కడ తీసుకొని పెద్ద పెద్ద సీరియల్స్ ఏ చేస్తున్నారు. మాములు బడ్జెట్ కంటే కూడా ఎక్కువ పెట్టి బడ్జెట్ మరి తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయ్.. ఎక్కువ రిస్క్ తీసుకుంటుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: