సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అనుష్క. ఆ సినిమా నుండి ఇప్పటివరకు 15 ఏళ్లుగా స్టార్ క్రేజ్ కొనసాగిస్తుంది అనుష్క. కెరియర్ మొదట్లో కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ కు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. అనుష్క కెరియర్ లో అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి సినిమాలు ప్రత్యేకంగా చెప్పుకునేలా ఉంటాయి. ఇవి వేరే హీరోయిన్స్ చేస్తే ఎలా ఉంటుందో కానీ అనుష్క చేసింది కాబట్టి సూపర్ హిట్ అయ్యాయని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇదిలాఉంటే 15 ఏళ్ళు సక్సెస్ ఫుల్ కెరియర్ పూర్తి చేసుకున్న అనుష్క తన అసలు పేరు స్వీటీ అన్న విషయం కొంతమందికే తెలుసు.

 

మాములుగా ముద్దుపేర్లు ఉంటాయి కాబట్టి అనుష్క అసలు పేరు స్వీటీ ముద్దుపేరు అనుకుంటారు కానీ సూపర్ సినిమా టైం లో నాగ్ సరసన హీరోయిన్ గా ఆడిషన్స్ చేస్తున్న టైంలో అనుష్కతో ఫోటో షూట్ చేశారట. ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేసి పేరు ఏంటని కనుక్కోగా స్వీటీ అని చెప్పిందట. పాస్ పోర్ట్ లో కూడా అదే ఉంటుందని చూపించిందత.. అయితే పూరి జగన్నాథ్ ఈమెకు వేరే పేరు పెట్టాలని అనుకుంటుండగా.. సందీప్ చౌతా దగ్గర సింగర్ గా వచ్చిన అమ్మాయి పేరు అనుష్క అని తెలియడంతో.. ఈ పేరు మీద ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అని ఆరా తీసి నాగార్జున ఫైనల్ గా స్వీటీ పేరుని అనుష్కని మార్చేశారు.

 

అలా ఆమె పేరుని మార్చేసి ఆమె ఫేట్ కూడా మార్చేశారు నాగార్జున. ఈ తరం హీరోయిన్స్ లో అనుష్క చేసిన పాత్రలు ఎవరు చేయలేదని చెప్పొచ్చు. స్టార్ సినిమాల్లో ఓ పక్క గ్లామర్ గా కనిపిస్తూనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆమె చాలా స్పెషల్ అయ్యింది. అనుష్క ఇప్పటికి అలాంటి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: