హార్డ్ వర్క్ తో ఏ పనిచేసినా అది మంచి ఫలితాన్ని ఇస్తుందని ఎప్పుడూ పెద్ద వాళ్ళు చెబుతూనే ఉంటారు. స్వీటీ అనుష్క కెరియర్ చూస్తే అది నిజమే అని గట్టిగా అది నిజమే అని ప్రూవ్ అవుతుంది. సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క 15 ఏళ్ల సినీ కెరియర్ లో ఎన్నో మంచి సినిమాలు చేసింది. హీరోయిన్ అంటే కేవలం స్టార్ హీరోల సినిమాల్లో పాటలకు, గ్లామర్ షోకి అన్నట్టు కాకుండా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు ఓ ఉత్సాహాన్ని తెచ్చింది అనుష్క.

 

ఆమె చేసిన అరుంధతి సినిమా అనుష్క కెరియర్ ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఆ తర్వాత రుద్రమదేవి, బాహుబలి ఇలాంటి సినిమాలు చేసే అదృష్టం కేవలం అనుష్కకు మాత్రమే దక్కిందని చెప్పొచ్చు. అనుష్క కూడా ఇచ్చిన పాత్రకు న్యాయం చేసేందుకు నిరంతరం వర్క్ అవుట్స్ చేస్తూనే ఉంటుందట. అందుకే సూపర్ సినిమా నుండి రాబోతున్న నిశ్శబ్దం వరకు అనుష్క ఎక్కడ కెరియర్ లో ఆఫర్లు లేక డీలా పెడ్డ దాఖలాలు లేవు.

 

తనని నమ్మి అవకాశం ఇచ్చిన డైరక్టర్స్ కు అంతకు రెట్టింపు అవుట్ ఫుట్ వచ్చేలా చేసింది అనుష్క. అందుకే స్టార్ హీరోయిన్స్ లో అనుష్క సెపరేట్ అని చెప్పుకుంటారు. కొందరు గ్లామర్ పాత్రలే చేస్తారు.. కొందరు అభియాన్ని మాత్రమే చూపించగలరు.. కానీ అందంతో పాటుగా అభినయంతో మెప్పించే భామలు చాలా తక్కువమంది ఉంటారు. వారిలో అనుష్క ఒకరు. 15 ఏళ్ళు సినీ కెరియర్ పూర్తి చేసుకున్న అనుష్క మరో 15 ఏళ్ళు సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు ఆమె ఫ్యాన్స్. నిశ్శబ్దం తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న అనుష్క పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగిస్తుందో లేదో అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: