ఒక్కోసారి మనం తీసుకునే ఒక నిర్ణయం జీవితాన్నే తల కిందులు చేస్తోంది. అలా అనుష్క తీసుకున్న ఓ నిర్ణయం ఆమె సినీ కెరీర్‌ను ఇబ్బందుల పాలు చేసింది. గ్లామర్ హీరోయిన్‌ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుష్క టాప్‌ హీరోలందరితో జత కట్టి స్టార్ హీరోయిన్‌ అనిపించుకుంది. అదే సమయంలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కూడా సై అని ఆ జానర్‌ చేసేందుకు చాలా కాలంగా ఏ హీరోయిన్‌ లేని లోటును బర్తీ చేసింది.


గ్లామర్ సినిమాలు చేస్తూనే అరుంధతి సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాల స్టార్‌ గా ఎదిగింది. ఈ ఒక్క సినిమా అనుష్కకు జాతీయ స్థాయిలో పేరు తీసుకువచ్చింది. అరుంధతి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సూపర్‌ హిట్ కావటంతో లేడీ ఓరియంటెడ్ కథలు రెడీ చేసుకున్న దర్శక నిర్మాతలకు అనుష్క బెస్ట్ ఆప్షన్‌ గా మారింది. అదే జోరులో మరిన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ లో అద్భుతమైన పాత్రలో ఆకట్టుకుంది.

 

అయితే ఆ సమయంలోనే అనుష్క చేసిన ఓ పొరపాటు ఆమె కెరీర్‌ ను కష్టాల్లో పడేసింది. బాహుబలి షూటింగ్‌ జరుగుతుండగానే రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో సైజ్‌ జీరో సినిమాలో నటించేందుక అంగీకరించింది అనుష్క. ఈ సినిమాలో భారీకాయంతో ఇబ్బంది పడే యువతి పాత్రలో నటించిన అనుష్క ఆ పాత్ర కోసం భారీగా బరువు పెరిగింది. అయితే ఈ సినిమా తరువాత బరువు తగ్గేందుకు అనుష్క చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. ఎంతకీ బరువు తగ్గకపోవటంతో అంతే  భారీఖాయంతో పలు చిత్రాల్లో నటించింది. దీంతో అనుష్క లుక్‌ పై విమర్శలు వినిపించాయి. ఆ ఒక్క సినిమాలో నటించాలన్న నిర్ణయమే అనుష్క కెరీర్‌ను నాశనం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: