సూపర్‌ సినిమాతో 2005లో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ అనుష్క శెట్టి. యోగా టీచర్‌ గా కెరీర్‌ ప్రారంభించిన అనుష్క అక్కినేని ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో సూపర్‌ సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ తరువాత వరుసగా కమర్షియల్ సినిమాలతో హల్‌ చల్‌ చేసింది. హైట్‌ పర్సనాలిటీ సీనియర్‌ హీరోలకు కూడా సూట్‌ అయ్యే ఫిగర్‌ కావటంతో అనుష్కకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

 

కమర్షియల్ హీరోయిన్‌ గా కెరీర్‌ ఫుల్ ఫాంలో ఉండగానే అరుంధతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాకు ఓకె చెప్పింది అనుష్క. ఈ సినిమాలో జేజమ్మ పాత్రలో నటించిన అనుష్కకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దీంతో ఒక్కసారిగా అనుష్క ఇమేజ్‌ తారా స్థాయికి చేరింది. ఈ ఒక్క సినిమాతో మిగతా అందరు హీరోయిన్లను వెనక్కి నెట్టి టాప్‌ ప్లేస్ లో నిలిచింది. అదే సమయంలో తమిళ సినిమాలు కూడా చేసి ఆకట్టుకుంది. దీంతో అనుష్క లేడీ సూపర్‌ స్టార్ అవుతుందని భావించారు.

 

అయితే అరుంధతి తరువాత సినిమాల ఎంపికలో చేసిన పొరపాట్లు ఆమె కెరీర్‌ ను కష్టాల్లో పడేశాయి. అరుంధతి తరువాత ఎక్కవగా కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసిన అనుష్క, పెద్దగా సక్సెస్‌ లు సాధించలేకపోయింది. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ జానర్‌ లో తెరకెక్కిన పంచాక్షరి లాంటి సినిమాలు ఫ్లాప్‌ కావటం తో సూపర్‌ స్టార్ ఇమేజ్‌ అందుకోవాల్సిన అనుష్క వెనకపడింది. ఇక సైజ్‌ జీరో సినిమాతో లుక్‌, పర్సనాలిటీ కూడా దెబ్బతినటంతో అనుష్క లేడీ సూపర్‌ స్టార్ అనే ఇమేజ్‌ను జస్ట్ మిస్ చేసేకుంది. ప్రస్తుత నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న అనుష్క ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: