కొందరికి కొన్ని క్యారెక్టర్లు వారి కెరీర్ తో పాటు.. జీవితాంతం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. సినీ పరిశ్రమలో, ప్రేక్షకుల్లో వారికి ఓ గౌరవాన్ని తెచ్చిపెడుతూంటాయి. అలాంటి అద్భుతమైన రోల్ దక్కించుకున్న అతికొద్ది నటీమణుల్లో అనుష్క కూడా స్థానం సంపాదించుకుంది. 2009లో వచ్చిన అరుంధతి సినిమాలో చేసిన జేజమ్మ క్యారెక్టర్ ఆమె సినీ జీవితంలో ఓ కలికితురాయిగా నిలిచిపోయింది. నిజానికి ఆ పాత్ర ముందు అనుష్కను వరించ లేదు. ఓ హీరోయిన్ కాదంటే అనుష్కను వరించింది.

 

 

అప్పటికి ఎన్టీఆర్ తో యమదొంగలో నటించిన మమతా మోహన్ దాస్ వద్దకు మొదట ఈ కథ చేరింది. నిర్మాత ఎమ్.శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణ ఈ కథను ఆమెకు వినిపించారట. కానీ మమత ఈ కథ విని తనకు వర్కౌట్ కాదేమోనని రిజెక్ట్ చేసింది. అంతుకుముందు ఏడాది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో అనుష్క ను ఎంచుకుని ఈ కథ చెప్పారట దర్శక, నిర్మాతలు. అనుష్క కూడా సంశయించిందట. అయితే.. ఈ సినిమా విషయంలో రాజమౌళి సహకారం కోరిందట. ‘శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి విజనరీ ఉన్న వ్యక్తి బ్యానర్ లో సినిమా అంటే మంచి అవకాశం కింద లెక్క. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవద్ద’ని చెప్పడంతో అరుంధతిని ఓ ఛాలెంజ్ లా తీసుకుని చేశాను అని అనుష్క గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

 

 

అలా.. అనుష్క చేసిన అరుంధతి పాత్ర తెలుగు సీనీ పరిశ్రమలో ఓ లెజండరీ మూవీలా నిలిచిపోయింది. ఓ లేడీ ఓరియంటడ్ మూవీ 80కోట్లు వసూలు చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. గ్రాఫిక్స్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లా నిలిచే ఎంఎస్ ఆర్ట్ బ్యానర్ కు, కోడి రామకృష్ణ దర్శకత్వ ప్రతిభకు తోడు అనుష్క నిండైన రూపం అరుంధతికి ప్రాణ ప్రతిష్ట చేశాయనే చెప్పాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: