టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సూపర్’ మూవీతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది అనుష్క.  మొదటి సినిమా లో అనుష్క హాట్ లుక్ తో కనిపించింది.  గ్లామర్ ప్రదర్శనతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.  అయితే ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన వరుస ఛాన్సులు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది.  ఒకటి కాదు రెండు కాదు అనుష్క నటించిన ఎన్నో సినిమాలో మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి.  గ్లామర్ పాత్రల్లో కనిపించిన అనుష్క ‘అరుంధతి’ సినిమా తో లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటించి తర్వాత రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి సినిమాల్లో తన సత్తా చాటింది. 

 

భాగమతి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నిశ్శబ్దం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  అయితే అనుష్క నటించిన నిశ్శబ్దం క్రేమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తుంది. అంతే కాదు ఇందులో అనుష్క మూగ అమ్మయిగా కనపిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అంటే మరోసారి తన విశ్వరూపం చూపించబోతుందన్నమాట.  అనుష్క సినీ ప్ర‌యాణానికి 15 సంవ‌త్స‌రాలు. అయితే ఈ మద్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీనియ‌ర్స్ సాధించిన దానితో పోలిస్తే నేను సాధించింది చాలా త‌క్కువ‌. అయితే దీన్ని నేను ఓ బాధ్య‌త‌గా తీసుకొని ఇంకా హార్డ్‌వ‌ర్క్ చెయ్యాలి, ఇంకా మంచి స్క్రిప్ట్స్ చేయాలనుకుంటాను. 

 

సినీ పరిశ్రమలో నా కన్నా సీరియన్ నటీమణులు ఎంతో గొప్ప పాత్రల్లో నటించారు.. అందుకే వారి పేరు ఇంకా మారుమోగుతుంది. అలాంటి మంచి పాత్రల్లో ఇంకా నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది.  సూపర్ సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టానని.. పూరి జ‌గ‌న్నాథ్   నుంచి మొద‌లుకొని తనకు ఇంత మంచి హిట్ సినిమాలు అందించిన  ప్ర‌తి డైరెక్ట‌ర్‌కూ చాలా థాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ మద్య తనపై వస్తున్న రక రకాల పుకార్ల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: