టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రయోగాలకు ఎప్పుడూ ముందే ఉంటుంది. గ్లామర్ బ్యూటీ గా ఎంట్రీ ఇచ్చినా.. తరువాత లేడీ ఓరియంటెడ్ సినిమాలో రిస్క్ చేసింది అనుష్క. కమర్షియల్ హీరోయిన్‌ గా కెరీర్‌ ఫుల్ ఫాంలో ఉండగానే అరుంధతి సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాల హీరోయిన్‌ గా టర్న్‌ తీసుకుంది ఈ బ్యూటీ. తరువాత కూడా కమర్షియల్ హీరోయిన్‌ గా కొనసాగుతూనే లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు, క్యారెక్టర్‌ రోల్స్‌ చేస్తూ ఆకట్టుకుంటోంది.

 

లాంగ్ గ్యాప్ తరువాత ఈ భామ చేస్తున్న సినిమా నిశ్శబ్దం. క్రాస్‌ ఓవర్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు. తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు వస్తాడు నా రాజు ఫేం హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు. కోన వెంకట్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో బహు భాషా నటుడు మాధవన్‌ హీరోగా నటిస్తున్నాడు. అంజలి, షాలినీ పాండేలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ మ్యాడ్సన్‌ కూడా నటిస్తున్నారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ తొలి వారంలో రిలీజ్‌ కు రెడీ అవుతోంది.

 

ఈ సినిమాలో మూగా చెవిటి అమ్మాయిగా నటిస్తోంది అనుష్క. డఫ్‌ అండ్‌ డంబ్‌ ఆర్టిస్ట్‌ గా నటించేందుకు చాలా హోం వర్క్‌ చేసింది స్వీటీ. అయితే అనుష్క అంటేనే హీరో రేంజ్‌ మాస్ డైలాగులు, ఎలివేషన్‌ సీన్లు ఎక్స్‌ పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్‌. మరి నిశ్శబ్దం సినిమాలో అలాంటి వాటికి అవకాశం లేదు. మరి ఈ నేపథ్యంలో మూగ అమ్మాయి అనుష్క ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిలిం కార్పోరేషన్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్‌ సంగీతమందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: