ప్రస్థుతానికి కరోనా వైరస్ భయంకరమైన స్థితిలో హైదరాబాద్ లో లేకున్నా భాగ్యనగర వాసులు మాత్రం విపరీతమైన భయాలతో బయటకు రావడం తగ్గించి వేసారు. దీనితో హైదరాబాద్ సిటీలోని అనేక మాల్స్ ధియేటర్లు జనం లేక కర్ఫ్యూ వాతావరణాన్ని తలపింప చేస్తున్నాయి. 


ఇలాంటి పరిస్థితులలో ఉగాది రావలసిన సినిమాలు అన్నీ వాయిదా పడినట్లు సంకేతాలు వస్తున్నాయి. దీనితో కొత్త సినిమాలు ఏప్రిల్ 2 వరకు విడుదల అయ్యే ఆస్కారం లేదు. ఈ నేపధ్యంలో ఈరోజు ఉదయం జరగబోతున్న ఎగ్జిబిటర్ల చాంబర్ సమావేశంలో ధియేటర్స్ ఓనర్స్ తమకు తామే స్వచ్ఛందంగా ధియేటర్ల మూయుడం విషయమై ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. 


జరుగుతున్న ఈ పరిణామాలు మిగతా హీరోలకు పెద్దగా ప్రభావం చూపించక పోయినా ముందుగా వెంటనే నష్టపోయేది నాని ‘వి’ అని అంటున్నారు. నాని కెరియర్ లో 25వ సినిమాగా తీయబడ్డ ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ రాబట్టాలి అన్న ఉద్దేశ్యంతో నాని చాల వ్యూహాత్మకంగా ఆలోచించి ఈ నెల 25న రాబోతున్న ఉగాది పండుగ బుధ వారం అయినప్పటికీ పండుగ మ్యానియా ఆ తరువాత వచ్చే వీకెండ్ తో పాటు టాప్ హీరోలతో పోటీ లేని సోలో రిలీజ్ తనకు కలిసి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. 


ఇప్పుడు ఆ ఆసలు ఆవిరి అయిపోవడంతో ‘వి’ మూవీకి మరొక డేట్ ను వెతుక్కోవలసిన పరిస్థితి నానీకి ఏర్పడింది. అయితే ఏప్రిల్ నెల మొదటి వారంలో అనుష్క ‘నిశ్శబ్దం’ ఆ తరువాత కేవలం వారం గ్యాప్ లో రాబోతున్న రామ్ ‘రెడ్’ లతో పాటు ఏప్రిల్ చివరి వారంలో నాగచైతన్య సాయి పల్లవి ల ‘లవ్ స్టోరీ’ ఇలా వరసపెట్టి రాబోతున్నాయి. ఈ సినిమాలు మాత్రమే కాకుండా ఇంకా చాల సినిమాలు లైన్ లో ఉన్నాయి. దీనితో ‘వి మూవీకి మళ్ళీ సోలో రిలీజ్ డేట్ దొరకడం ఇప్పట్లో సాధ్యం అయ్యే పనిగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితులలో చేతికి అందివచ్చిన సోలో రిలీజ్ అవకాసం మిస్ అయినందుకు నాని షాక్ లో ఉన్నాడు అని టాక్..

 

మరింత సమాచారం తెలుసుకోండి: