నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో హుషారుగా ఉన్నాడు. మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ లో ఉన్న నాని చేతిలో ప్రస్తుతం మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో వి చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండగా టక్ జగదీష్ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరో చిత్రం శ్యామ్ సింగరాయ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. 

 

వి చిత్రం ఉగాది కానుకగా మార్చ్ 25వ తేదీన విడుదలకి సిధ్ధంగా ఉంది. అయితే కరోనా ప్రభావం వల్ల థియేటర్లకి జనాలు వస్తారో రారో అన్న ఉద్దేశ్యంతో సినిమా విడుదలని వాయిదా వేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడట. ఇప్పటివరకైతే ఈ విషయమై ఎలాంటి ప్రకటన రాలేదు. అదలా ఉంచితే ఈ సినిమా నుండి ఒక లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది. ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తున్న మాట తెలిసిందే.

 


టీజర్ లో పోలీస్ ఆఫీసర్ కి ఛాలెంజ్ విసురుతూ చాలా స్టైలిష్ గా కనబడ్డాడు నాని అచ్చు క్లాసిక్ విలన్ లా బాగా సూటయ్యాడు. అయితే సినిమా క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ బయటపడుతుందట. ఆ ట్విస్ట్ సినిమా పూర్తి కథని మార్చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. ఆ ట్విస్ట్ వచ్చినపుడు ప్రేక్షకుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతాడని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఇంద్రగంటి దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించిన నాని ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించనున్నాడు.

 


నానితో పాటు సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్నారు. నివేథా థామస్ హీరోయిన్ గా కనిపిస్తుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాఉ నిర్మించారు. సైరా చిత్రానికి సంగీతం అందించిన అమిత్ త్రివేది ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: