అనుష్క ఎంతో మంచి నటి. స్టార్ హీరోలతో నటించిన ట్యాలెంట్ యాక్టర్ మన అనుష్క శెట్టి. ఈమె ఎన్నో సినిమాలలో నటించింది. అప్పటి హీరోల పక్కన నటించి చక్కటి యాక్టింగ్ తో ఎంతో బాగా ఆకట్టుకున్న నటి మన అనుష్క. ఎన్నో అవార్డులు కూడా దక్కించుకున్న నటి ఈమె. అనుష్క అనేక సినిమాలలో నటించింది. అరుంధతి, పంచాక్షరి, భాగమతి, రుద్రమ దేవి. ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చెయ్యాలంటే అనుష్క తర్వాతే ఎవరైనా.

 

 

అనుష్క సినిమాల్లోకి ఎంతో విడ్డూరంగా అడుగు పెట్టింది. ఆమె గురించి దర్శకుడు పూరి జగన్నాధ్ ఇలా అన్నాడు. మొదట సూపర్ సినిమాకి హీరోయిన్ వెతుకుతున్న రోజుల్లో ఒకరి ద్వారా అమ్మాయి ఉంది అని తెలిసింది పూరికి. ఆ తర్వాత ఆమె ఆ హొటల్ కి వచ్చిందట. అప్పుడి పూరి జగన్నాధ్ ఆమెని చూసి బాగుంది అని అనుకున్నాడట. హైట్ బాగుంది బాగుంటుంది అని అనుకున్నాడట. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ కూడ చూసి సరే బాగుంటుంది అని చెప్పిందట. సరే అని వివరాలు అడిగిన పూరికి షాక్ తగిలింది. 

 

 


పూరి జగన్నాధ్ పేరు అడిగితే స్వీటి అని అంది. డాన్స్ వచ్చా అంటే ఏమో ఎప్పుడు ట్రై చెయ్యలేదు చెయ్యగలనో లేదో తెలీదు అని అందిట అనుష్క. ఆ తర్వాత ఫోటో ఇవ్వమన్నాడట పాస్ పోర్ట్ ఫోటో కంటే చిన్న ఫోటోని తీసి ఇచ్చిందంట అనుష్క. పూరి ఇంక అవాక్ అయ్యాడట. ఇంక అంతే పూరి అనుష్కకి అవకాశం ఇవ్వాలో లేదో తెలియక తికమక పడ్డాడు.

 

 

కానీ స్వీటికి చివరకి అవకాశం లభించింది. అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది అనుష్క. ఇలా అనుష్క సినిమాల్లో మొదలు పెట్టి అలా విజయాలనెన్నో అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: