తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చియాన్ విక్రమ్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  వాస్తవానికి విక్రమ్ తెలుగు హీరోనే.. మొదట ఆయన కెరీర్ తెలుగోనే మొదలు పెట్టినా.. తమిళ్ లో బాగా కలిసి వచ్చింది. దాంతో అక్కడే స్థిరపడ్డారు.. తమిళ్ అభిమానులు ఆయన్ని ముద్దుగా చియాన్ అని పిలుచుకుంటారు.  ప్రస్తుతం విక్రమ్ ‘కోబ్రా’ చిత్రంలో నటిస్తున్నాడు.  (డిమాంటి కాలనీ’, ‘ఇమైక్కా నొడిగళ్‌’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు ప్రస్తుతం ‘కోబ్రా’కు దర్శకత్వం వహిస్తున్నారు.  విక్రమ్‌ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా  నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘7 స్క్రీన్‌ స్టూడియో’, ‘వియాకామ్‌ 18 స్టూడియోస్‌’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.   

 

ఈ చిత్రం  ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ భారతీయ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక విక్రమ్ ‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ చేశాడు. కోబ్రా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఏడు డిఫరెంట్ గెటప్స్‌లో కనబడి సర్‌ప్రైజ్ చేసాడు చియాన్.. ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త గెటప్స్‌లో ‘కోబ్రా’లో కనిపిస్తున్నాడు.  ప్రపంచాన్ని క‌రోనా వైర‌స్ వ‌ణికిస్తున్న విష‌యం తెలిసిందే. దీని దెబ్బ‌కు హేమా హేమీలే విదేశాల్లో తిర‌గ‌డానికి భ‌యంతో వ‌ణికిపోతున్నారు.

 

సామాన్య జ‌నం ప‌బ్లిక్ ప్లేస్‌ల‌కి రావ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. షాపింగ్ మాల్స్‌, సినిమా థియేట‌ర్స్, విహార యాత్ర‌లు అన్నీ క్లోజ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.  ఈ వైర‌స్ కార‌ణంగా స్టార్ కొన్ని భారీ చిత్రాల నిర్మాణం అర్థాంత‌రంగా ఆపేయాల్సి వ‌స్తోంది. తాజాగా విక్ర‌మ్ చిత్రం షూటింగ్ కూడా క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఆగిపోయిన‌ట్టు వార్తలు వస్తున్నాయి.  రష్యాలో అర్ధంతరంగా చిత్రీకరణను ఆపేసినట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల్లో చిత్రీకణ నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: