అనుష్క తెలుగులో ఎన్నో చిత్రాల్లో న‌టించి మెప్పించింది. సూప‌ర్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌యిన ఈ భామ అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ న‌టించి మెప్పించింది. హీరోల‌తో స‌మానంగా న‌టించేది. టాలీవుడ్‌లో మొద‌ట అన్నీ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో న‌టించిన ఈ భామ స‌డెన్‌గా కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `అరుంధ‌తి` చిత్రంలో న‌టించిన జెజ‌మ్మ పాత్ర‌లో ఇటు క్లాస్ అటు మాస్ ఆడియ‌న్స్‌కి ద‌గ్గ‌రైంది. అందం అభిన‌యం అన్నీ ఉన్న ఈ భామ ఒక్కసారిగా లైఫ్ ఆ చిత్రంతో ట‌ర్న్ అయిపోయింది. ఎక్కువ‌గా లేడీ ఓరియంటెడ్ పాత్ర‌ల‌కు ప్రాధాన్యత ఇచ్చేది. బిల్లాలో బికినీ వేసినా జెజ‌మ్మ‌లా క‌త్తి ప‌ట్టుకున్నా.. దేవ‌సేన‌లా హంస‌వాహ‌నంలో ఆకాశంలోకి ఎగిరినా ఆమెకు ఆమె సాటి. ఆమెకు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి త‌రంలో ఉన్న హీరోయిన్లు ఎవ్వ‌రూ సాటిరార‌నే చెప్పాలి. అంత‌మంచిగా కొన‌సాగుతున్న ఆమె కెరియ‌ర్ స‌డెన్‌గా ఆ చిత్రంతో కాస్త డ‌వున్ ఫాల్ అయింది. 

 

సైజ్ జీరో చిత్రంలో న‌టించి కాస్త ఒళ్ళు రావ‌డంతో ఆమెకు కొంత కాలం గ్యాప్ వ‌చ్చింది. ఇక లావు త‌గ్గ‌డానికి ఎన్ని క‌స‌ర‌త్తులు చేసిన‌ప్ప‌టికీ ఆమె మాత్రం స‌న్న‌గా అవ్వ‌డంలేదు. అయిన‌ప్ప‌టికీ త‌న కెరియ‌ర్‌కి త‌గ్గ పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ అలా ముందుకు సాగుతుంది. ఇటీవ‌లె ఆమె సినీ కెరియ‌ర్ మొద‌లుపెట్టి 15ఏళ్ళు దాట‌డంతో ఇండ‌స్ట్రీలోని ద‌ర్శ‌క‌నిర్మాత‌లంతా వ‌చ్చి వాళ్ళ వాళ్ళ ఆశీర్వాదాల‌ను.. ఆమెతో వాళ్ళ‌కున్న అనుబంధాన్ని చాటి చెప్పారు. ప్ర‌స్తుతం ఆమె నిశ‌బ్దం అనే చిత్రంలో ఓ మూగ‌పాత్ర‌లో పెయింట‌ర్‌గా క‌నిపించ‌బోతుంది. ఇక ఆ పాత్ర‌లో ఏ విధంగా మెప్పించ‌బోతుందో తెలియాలంటే ఏప్రిల్ 2వ‌ర‌కు ఆగాల్సిందే మ‌రి.

 

 ఇక ఇదిలా ఉంటే...అనుష్క ఎన్నిహిట్లు కొట్టిన్ప‌ప‌టికీ టాలీవుడ్‌ను దాటి బాలీవుడ్‌కి మాత్రం ఎప్పుడూ కూడా ట్రై చెయ్య‌లేదు. ఒక‌టి రెండు సినిమాలు హిట్ అయితే చాలు హీరోయిన్ల క‌ళ్ళు య‌ధావిధిగా బాలీవుడ్ పైన ప‌డిపోతాయి. అలాగే అక్క‌డి నిర్మాత‌లు కూడా ఒక‌టి రెండు హిట్లు వ‌చ్చిన హీరోయిన్ల‌ని మాత్రం వ‌ద‌లిపెట్ట‌రు. మ‌రి ఈ విష‌యం మాత్రం ఎందుకోగాని మిస్ట‌రీగా మిగిలిపోయింది. ఈమె కూడా ట్రై చెయ్య‌లేదు. వాళ్ళు ఈమె కోసం పెద్ద‌గా ట్రై చెయ్య‌లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: