సూపర్ సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన అనుష్క ఆ తర్వాత తమిళ కన్నడ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుని  స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుస అవకాశాలతో ఎంతో క్రేజ్ సంపాదించింది ఈ అమ్మడు. కొన్నేళ్ల పాటు సౌత్ ఇండస్ట్రీలో తన హవా నడిచింది అనే చెప్పాలి. టాలీవుడ్లోని స్టార్ హీరోలందరి సరసన ఇప్పటికే నటించేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక అందాల ఆరబోతలో కూడా ఈ అమ్మడు ఎక్కడ తక్కువ కాదండోయ్... తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ఎప్పుడూ ప్రేక్షకులకు మత్తెక్కిస్తూనే ఉండేది ఈ ముద్దుగుమ్మ. అంతే కాకుండా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ నటన పరంగా కూడా ఎన్నో ప్రశంసలు అందుకుంది. 

 

 

 ఇక సైజ్ జీరో అనే ప్రయోగాత్మక సినిమాలో బాగా లావెక్కిన ఈ ముద్దుగుమ్మ. అప్పటి వరకూ ఎంతో నాజూకైన అందాలతో మెరిసిన ఈ అమ్మడు.. సైజ్ జీరో లో మాత్రం ఊహించినంత లావు  అయిపోయింది. దీంతో ఈ సినిమాలో అంత ప్రయోగం చేసినప్పటికీ ఈ సినిమా మాత్రం డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఇక సినిమా విషయం పక్కన పెడితే ఈ సినిమా కోసం ఏకంగా 100 కేజీల వరకు పెరిగినా నాజూకు ముద్దుగుమ్మ అనుష్క... ఆ తర్వాత బరువు తగ్గేందుకు మాత్రం చాలానే ప్రయత్నాలు చేసింది. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ అమ్మడు మాత్రం బరువు తగ్గ లేకపోయింది అని చెప్పాలి. 

 

 

 ఇక మామూలుగా అందంగా  ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లకు డిమాండ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక అనుష్క ఒక్కసారిగా లావై పోవడంతో సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే లావు తగ్గడానికి ఈ అమ్మడి చేయని ప్రయత్నం  అంటూ లేదు. ఒకానొక సమయంలో ముఖానికి మాస్క్ వేసుకుని హైదరాబాద్ వీధుల్లో  ఏకంగా 20 కిలోమీటర్ల వరకు సైకిల్ కూడా తొక్కిందట . తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ వేసుకుని ప్రతిరోజూ 20 కిలోమీటర్ల వరకు సైక్లింగ్ కూడా చేసిందట. అయినా కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందట. ఇకపోతే ప్రస్తుతం ఈ అమ్మడు ప్రస్తుతం  నిశ్శబ్దం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: