టాలీవుడ్లో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఏమిటంటే... ఎవరైన ఒక ఇద్దరు పెయిర్. అంటే... ఒక హీరో హీరోయిన్ కాస్త ఎక్కువ చిత్రాల్లో నటించినా వాళ్ళ పెయిర్ చూడటానికి బావుంది అనుకున్నా అలాగే వాళ్ళు ఇండస్ట్రీలో ఏ మాత్రం కాస్త సన్నిహితంగా మెలిగినా వాళ్ళ పైన రూమర్స్ రావడం అనేది చాలా సర్వ సాధారణంగా మారిన ఆచారం అని చెప్పాలి. ఇక అలాంటి రూమర్సే మన టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కల గురించి అందరూ అనుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ లవర్స్ అని ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని. ఇంకా వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని.. వాళ్ళ ఇళ్ళల్లో ఇష్టం లేదని అయితే వీళ్ళు వాళ్ళని ఒప్పించే పనిలో ఉన్నారని ఇలా మీడియా ఎవరికి నచ్చిన ధోరణిలో వాళ్ళు కథలు అల్లుకుంటూ పోతుంటారు.
కానీ అసలు విషయం ఏమిటంటే అనుష్క ప్రభాస్‌లు చూడటానికి చాలా చక్కగా ఉన్నా ఈడు జోడు కుదిరినా వాళ్ళిద్దరూ వివాహం మాత్రం చేసుకోరు. ఎందుకంటే వారిద్దరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్. ఎప్పటికీ అలా ఉండటానికే ఇష్టపడతారు. ఇక ప్రభాస్, అనుష్క ఎంత స్నేహంగా ఉంటారంటే వారిద్దరూ కూడా ఏ సినిమా ఆఫర్ వచ్చినా ప్రభాస్ ముందు ఆ స్క్రిప్ట్ గురించి అనుష్కతో డిస్కస్ చెయ్యకుండా చెయ్యడు అంత సన్నిహితంగా వారిద్దరూ ఉంటారు. అలాగే అనుష్క కూడా సినిమాలకు సంబంధించి దాదాపు ఏ నిర్ణయమైన సరే ప్రభాస్‌ను సంప్రదించి తీసుకుంటది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. వారిద్దరూ ఒకటే ప్రొఫెషన్ కావడంతో వారిద్దరూ కూడా ఈ నిర్ణయాలు తీసుకుంటారు.
ఇక వీరిద్దరూ ఎప్పుడైనా సమయం దొరికితే చక్కగా స్నేహంగా మాట్లాడుకోవడం ఎక్కడైనా కలవడం ఇవన్నీకూడా చాలా సహజంగా జరుగుతాయి. వారిద్దరి ఇళ్ళల్లో కూడా వాళ్ళ రిలేషన్ గురించి తెలుసు కాబట్టే ఎప్పుడూ ప్రభాస్‌ని అనుష్కని పెళ్ళి చేసుకోమని ఇటు ప్రభాస్ ఫ్యామిలీ ఒత్తిడి చేయలేదు. ప్రభాస్ అనుష్కనివివాహం చేసుకోకపోయినా ఆయన లిలిట్ హార్ట్‌లో ఆమె స్థానం ఎప్పటికి ఓ మంచి స్నేహితురాలిగా ఉంటుంది.