తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అభిమానుల మనసులు కొల్లగొట్టి ఎన్నో ఏళ్ల పాటు హవా నడిపించిన హీరోయిన్ అనుష్క. యోగా టీచర్ గా ఉన్న అనుష్కని... దర్శకుడు పూరి జగన్నాథ్ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేశాడు. మొదటి సినిమాతోనే తన క్యూట్ క్యూట్ అందాలతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ అమ్మడు. ఇక అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరడుగుల అందాల ముద్దుగుమ్మ ను చూడని తెలుగు ప్రేక్షకులు అనుష్క ని చూసి మనసు పారేసుకున్నారు. ఇక మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో అనుష్క కెరీర్ కి బాగా కలిసి వచ్చింది. ఇక అనుష్క అందం అభినయం కూడా దర్శక నిర్మాతలు బాగా ఆకర్షించింది. దీంతో వరుస  అవకాశాలను అందిపుచ్చుకుంది  ఈ అమ్మడు. 

 

 

 అయితే తెలుగు ఇండస్ట్రీలో అనుష్కకు ప్రభాస్ కి మధ్య మంచి స్నేహ పూర్వక బంధం  ఉన్న విషయం తెలిసిందే. అయితే అనుష్క ప్రభాస్ జోడిగా ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఇక వీరిద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉంటుంది. దీంతో ప్రభాస్ అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్త వస్తుంది ఏదో గత కొన్ని రోజులుగా కాదు గత కొన్నేళ్ల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిపోయింది. పలుమార్లు ఇద్దరూ క్లారిటీ ఇచ్చినప్పటికి కూడా ప్రేక్షకులు మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని  అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.

 

 

 

 అయితే ఇక ప్రభాస్ అనుష్క ఏ సినిమాలో నటించిన అది సూపర్ హిట్ జోడీగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ అనుష్క తో బిల్లా, మిర్చి, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించారు. అందుకే ఈ ఇద్దరి జోడి ని బ్లాక్ బస్టర్ జోడీ అని పిలుచుకుంటారు అభిమానులు. అయితే ఓ ఇంటర్వ్యూ కి హాజరైన ప్రభాస్ రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు గాను అనుష్క గురించి పాజిటివ్ నెగిటివ్ చెప్పాలని యాంకర్ ప్రశ్నించగా... అనుష్క చాలా అందంగా ఉంటుందని... మంచి డ్రెస్సింగ్ స్టైల్  ఉంటుందని అంతే కాకుండా ఎంతో మంచి వ్యక్తి అని చెప్పాడు. మరి నెగిటివ్ ఏమిటి అని అడుగగా... అనుష్క తొందరగా ఫోన్ ఎత్తదు అని చెప్పుకొచ్చాడు. కేవలం తన ఫోన్  మాత్రమే కాదు ఎవరి ఫోన్ తొందరగా అనుష్క ఎత్తదు అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. అదొక్కటి తప్ప అనుష్క అన్నిట్లో పర్ఫెక్ట్ అని తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: