పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అనుష్క అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే.. ఎంతో మంది కొత్త హీరోయిన్లు వస్తున్నప్పటికీ అనుష్క క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి... తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది. ఇక ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ గ్లామర్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో మెరిసింది. ఎంతో మంది స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది ఆరడుగుల అందాల అప్సరస అనుష్క.ఎన్నో  గ్లామరస్ పాత్రలో మెరిసిన ఎంతగానో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఇక ఎన్నో ఏళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. కేవలం తెలుగు చిత్రపరిశ్రమలోనే కాదు అటు తమిళ సినిమాల్లో కూడా వరుస అవకాశాలను అందిపుచ్చుకొని తన హవా నడిపించింది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 అయితే అనుష్క ప్రభాస్ తో ఎన్నో సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనుష్కకి ప్రభాస్ కి మధ్య లవ్ రిలేషన్ షిప్ నడుస్తుంది అంటూ ఎన్నో రోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికీ ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఓ వైపు ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా బాచిలర్ గా ఉండడం మరో వైపు అనుష్క కూడా పెళ్లి ఊసు ఎత్తకపోవడం తో వీరిద్దరి మధ్య నిజంగానే రిలేషన్షిప్ ఉందని వీరిద్దరూ కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఇప్పటి నుంచి వస్తున్నవి  కావు గత కొన్నేళ్ల నుంచి ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని వీరిద్దరూ చాలా సార్లు మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చిన కూడా వీరి మధ్య ప్రేమ లేదు అని అభిమానులు మాత్రం నమ్మలేకపోతున్నారు.

 

 

 ఇక వీరిద్దరూ కలిసి బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా సాహో లో నటించారు  ఈ సినిమాలో మొదట అనుష్కని తీసుకోవాలి అనుకున్నారట. కానీ కృష్ణంరాజు వల్లే అనుష్క ఈ సినిమాలో నటించలేదు అని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉంది అని వార్తలు రోజురోజుకీ జోరందుకుంటున్న తరుణంలో  కృష్ణంరాజు దీనిపై కాస్త సీరియస్ అయ్యాడట. ప్రభాస్ ను  అన్నయ్య అని పిలవాలి అంటూ అనుష్కకు కృష్ణంరాజు సూచించారట. దీంతో కోపం వచ్చిన అనుష్కసినిమా నుంచి తప్పుకుంది అంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఒకానొక సమయంలో అనుష్క ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పరిచయం ఉన్న అబ్బాయిలు  అందర్నీ అన్నయ్య అని పిలవలేమూ  కదా అంటూ కృష్ణంరాజు ను ఉద్దేశించి మాట్లాడింది అంటూ అప్పట్లో టాక్ కూడా వినిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: