టాలీవుడ్ అగ్ర కుటుంబాల్లో నందమూరి కుటుంబం ఒకటి. తెలుగు సినిమా ఉన్నప్పటి నుంచి నేటి వరకు కూడా టాలీవుడ్ లో ఆ కుటుంబం ఆధిపత్యం కొనసాగుతుంది. ఆ ఫ్యామిలీ తో సినిమా తీస్తే చాలు అనుకునే ఎందరో హీరోయిన్స్ ఉన్నారు. బాలకృష్ణ తో లేదా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలి అనుకునే హీరోయిన్స్ మనకు కనపడతారు. కాని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అనుష్క మాత్రం నందమూరి ఫ్యామిలీ తో ఒక సినిమా చేసి సరిపెట్టేసింది. దానికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. 

 

ప్రధానంగా చెప్పుకునేది ఆమె నందమూరి హీరోల కంటే హైట్ ఎక్కువగా ఉండటమని చెప్తారు. అనుష్క హైట్ ప్రభాస్, లేదా గోపి చంద్, మహేష్ బాబు లాంటి వారితో మాత్రమే సరిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె సినిమా చెయ్యాలని చూసినా సరే ఒక దర్శకుడు వద్దని సలహా ఇచ్చాడట. దీనితో ఆమె వెనక్కు తగ్గినట్టు సమాచారం. అదే విధంగా ఒక కుటుంబం నందమూరి ఫ్యామిలీ కి దూరంగా ఉండమని ఆమెకు సలహా ఇవ్వడంతో అనుష్క ఆ ఫ్యామిలీ కి దూరంగా ఉందని చెప్తూ ఉంటారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని ఆమె మాత్రం వారితో ఒక్క సినిమానే చేసింది. 

 

ఒక్క మగాడు అనే సినిమా చేసింది ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత అనుష్క మళ్ళీ ఆ ఫ్యామిలీ జోలికి పెద్దగా వెళ్ళలేదు. మెగా ఫ్యామిలీ తో కూడా తక్కువ సినిమాలే చేసింది అనుష్క. మరి దీనికి కారణం ఎం చెప్తారో. నందమూరి ఫ్యామిలీ తో చెయ్యాలని ఆఫర్లు వచ్చినా సరే ఆమె అంతగా ఆసక్తి చూపించలేదని, దానికి కారణం ఆ ఫ్యామిలీ తో చేస్తే హీరోయిన్ కి గుర్తింపు రాకపోవడం కూడా ఒక కారణమని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: