సినీ ఇండస్ట్రీలో ఈ మద్య కొంత మంది నటీమణులు తమకు జరిగిన ఛేదు అనుభవాలు సోషల్ మాద్యమాల ద్వారా షేర్ చేసుకుంటున్నారు.  కాస్టింగ్ కౌచ్, మీ టూ ఉద్యమాల నేపథ్యంలో నటీమణులు తమపై జరిగి లైంగిక దాడుల గురించి గుట్టు విప్పుతున్నారు. తాజాగా సీరియల్ యాక్టర్‌గా ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటి వాని భోజన్. మాయ అనే టీవీ సీరియల్ ద్వారా ఆమె నటిగా పరిచయం అయ్యారు. బుల్లితెరపై తనకు మంచి పేరు వచ్చిందని.. వెండి తెరపై అదృష్టం పరీక్షించుకోవడానికి ఛాన్సు కోసం వెళితే చేదు అనుభవం ఎదురైందని అన్నారు. సినీ అవకాశం కావాలంటే ఓ నిర్మాత తనను పడక గదికి రమ్మన్నాడని తెలిపింది. దీంతో తాను అలాంటి అవకాశం తనకు వద్దని చెప్పినట్లు పేర్కొంది. దీంతో కోలీవుడ్‌లో ఈ అంశం చర్చనీయాంశం అవుతోంది.

 

ఆమె నటించిన తొలి చిత్రం 'ఓ మై కడవులే' సూపర్‌హిట్‌ అయింది. ప్రస్తుతం పలు సినిమాల్లో ఆమె నటిస్తోంది.  ప్రస్తుతం వైభవ్‌తో జతకట్టిన లాకప్‌ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ మధ్యన వాణిబోజన్‌ తరచూ వార్తల్లో ఉంటోంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా ఉందని.. అనుభవం ఉన్న నటులనే పడక గదికి రమ్మంటుంటే.. కొత్తగా వచ్చే వారి పరిస్థితి ఏంటీ అంటున్నారు. కాస్టింగ్‌ కౌచ్‌ అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఇంతకు ముందే పలువురు నటీమణులు మీటూ బాధలను వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు వరకూ వెళ్లారు.   

 

హీరోయిన్లు, కాస్త నాగరీకంగా దుస్తులు ధరించి, సంప్రదాయబద్ధంగా నడుచుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదనే వాదన వినిపిస్తోంది.  గతంలో తెలుగు లో శ్రీరెడ్డి, బాలీవుడ్ లో తనూ శ్రీ దత్తా, కంగనా రౌనత్, తమిళ్ లో వరలక్ష్మీ శరత్ కుమార్, చిన్మయి లాంటి వారు తమకు జరిగిన అన్యాయాలపై ధైర్యంగా మాట్లాడారు. కాస్టింగ్‌ కౌచ్‌ వంటి సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనాలని, జరిగిపోయిన తర్వాత చెబితే ప్రయోజనం ఉండదని కొంత మంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: