టాలీవుడ్ అగ్రకథా నాయకురాల్లో  అనుష్క ఒకరు. బెంగుళూర్ నుంచి వచ్చిన ఈ భామ అసలు పేరు స్వీటీ శెట్టి. టాలీవుడ్ కి సూపర్ అనే సినిమా ద్వారా పరిచమైంది, ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున పక్కన నటిచింది. ఇందులో పాత్ర తక్కువ అయినా  బాగా నటిచింది. ఈ సినిమా హిట్ కాకపోయినా అనుష్క నటనకి మంచి మార్కులు పడ్డాయి. అనుష్క సినీ జీవితంలో మైలురాయి ఏది అంటే అరుంధతి అనే చెప్పుకోవాలి. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లెక్కలు తిరగ రాసింది.

 

లేడి ఓరియెంటెడ్ సినిమాలో అనుష్క బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకుంది. దీనితో అనుష్క ప్లేస్ ని ఎవ్వరు టచ్ చేయలేకపోయారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అయినా కాజల్ ,సమంత కూడా అనుష్క రేంజ్ అందుకోలేకపోయారు. కేవలం గ్లామరస్ హీరోయిన్స్ గా పేరుపొందారు. దీనితో వీళ్లకి అనుష్క మీద జలస్ మొదలైంది అని సోషల్ మీడియా లో పుకార్లు స్టార్ట్ అయ్యాయి. అనుష్క మాత్రమే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయగలుగుతుందా  మాకు అవకాశం ఇస్తే మేము ఏంటో నిరూపించుకుంటాం అని అన్నట్లు సోషల్ మీడియా లో చర్చలు జరిగాయి .

 

నిజం చెప్పాలి అంటే అనుష్క  కాజల్ మరియు  సమంత మంచి స్నేహితులు. ఒకరి అంటే ఒకరు గౌరవం ఇచ్చుకుంటారు. ఎవరైనా సినిమాలు విడుదల అవుతుంటే ముందుగానే శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఒకరి ఇంట్లో జరిగే శుభకార్యాలకు హాజరు అవుతారు. విదేశాల్లకి కూడా కలిసి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు. కానీ సోషల్ మీడియా కె ఎవరైనా బావుంటే నచ్చదేమో ఇలాంటి పుకార్లు పుట్టిస్తారు. ఇప్పటికైనా ఇలాంటి వార్తలు స్వస్తి పలకాలి సోషల్ మీడియా. ప్రస్తుతం ఈ ముగ్గురు సీనియర్ హీరోయిన్లు గా ఉన్నారు. అందులో సమంతాకు వివాహం కాగా అనుష్క, కాజల్ చేసుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: