సినీ రంగంలో స్వీటీ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన సూపర్ సినిమాతో తెరపైకి వచ్చింది. అక్కినేని నాగార్జున సరసన నటించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత మహానంది, విక్రమార్కుడు, అస్త్రం, రెండు, లక్ష్యం, డాన్, ఒక్క మగడు ఇలా అనేక సినిమాలలో నటించింది అనుష్క. ఇటు తెలుగు చిత్రాలలో మాత్రమే కాక తమిళ సినిమాల్లో కూడా అనుష్క నటించింది. అరుంధతి సినిమాతో మంచి గుర్తింపు లభించింది ఈమెకి. 

 

 

అనుష్క చాలా మంచి నటి అని ఇండస్ట్రీలో ఎంతో మంది వివిధ సందర్భాల్లో చెప్పడం తెలిసిన సంగతే. ఇది మాత్రమే కాదు ఆమె ఎంతో కూల్ గా, స్వీట్ గా ఉంటుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో ఫేమస్ అయ్యిపోయింది ఈ నటి. అంతే కాకుండా ఎంతో మంచి ప్రజాదారణ పొందింది అనుష్క. తెలుగులో విభిన్న పాత్రలని చేసి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్న నటి ఈమె. అనేక చిత్రాలలో ఎన్నో మంచి పాత్రలు చేసి మంచి స్థానం దక్కించుకుంది మనం స్వీటీ. 

 

 


నటి అనుష్క మెగాస్టార్ చిరంజీవి సరసన స్టెప్పులేసి అందాన్ని ఒలకపోసింది. ఎంతో హాట్ గా అనుష్క కనిపించి కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. "ఐ వాంట్ థిస్ స్పైడర్ మ్యాన్" అంటూ స్టాలిన్ సినిమాలో మెగాస్టార్ తో జత కట్టింది మన బొమ్మాలి. ఐటం సాంగ్  కూడా తగ్గేది లేదంటూ సాంగ్ చేసి కేక పెట్టించింది అనూష్క. ఈ బ్యూటీ అరుంధతి, పంచాక్షరి, రుద్రమ దేవి, బాహుబలి సినిమాల్లో ఎంతో మంచి పాత్రలని చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. అనూష్క 2005 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చినా ఏ మాత్రం జోష్ ఇప్పటికి తగ్గలేదు. రోజు రోజుకి వచ్చే అవకాశాలతో దూసుకెళ్ళిపోతోంది మన అనూష్క శెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: