టాలీవుడ్ లో వరుసగా జెర్సీ, గ్యాంగ్ లీడర్ హిట్ తర్వాత నాని వైవిధ్యభరితమైన మూవీలో నటిస్తున్నాడు.  ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ‘వి’ మూవీలో నటిస్తున్నాడు.  ఈ మూవీలో మరో కీలక పాత్రలో హీరో సుదీర్ బాబు నటిస్తున్నారు.  ఇందులో నాని విలన్ షేడ్స్ లో ఉన్న పాత్ర అయితే సుధీర బాబు ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ  సినిమాను ఉగాది కానుకగా ఈ నెల 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.  ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదిన మార్చే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉనట్టుగా తెలుస్తోంది.    ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎక్కడా చూసిన కరోనా భయం విలయ తాండవం చేస్తోంది.

 

ఇప్పటికే పెద్ద, చిన్నా సినిమాలు   క్యాన్సల్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.  పెద్ద హీరోలు సైతం తమ షూటింగ్ క్యాన్సల్ చేసుకుంటున్నారు.   సాధారణంగా ఏ సినిమా అయినా వేసవి కాలంలో రిలీజ్ చేయాలని చూస్తుంటారు.. కానీ ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా భయంతో వణికి పోతుంది. ఇప్పటికే భారత్ లో 80 కేసులకు నమోదు అయ్యాయి.  అంతే కాదు ఇద్దరు కరోనా వల్ల మరణించారు.  దాంతో మరింత అప్రమత్తం అవుతున్నారు.. డాక్టర్లు. అంతే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇపుడిపుడే కరోనా పై కేసులు నమోదు కావడం వంటివి జరగడంతో సామాన్య జనాలు థియేటర్స్, మాల్స్ వంటి అత్యధిక రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు.

 

దాంతో ఈ సినిమా రిలీజ్ చేయడం ఇప్పుడు సరైన సమయం కాదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. హీరో నానికి ఇది 25వ మూవీ కాగా, ఇంద్రగంటి దర్శకత్వంలో మూడో మూవీ కావడం విశేషం.   కాకపోతే ఈ విషయంపై అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: