తెలుగు బుల్లిరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతో మంది నటులు వెలుగు లోకి వచ్చారు. ఏడేళ్లుగా సాగుతున్న జబర్ధస్త్ కామెడీ షోలో ఎంతో మంది నటులు వచ్చారు.. వెళ్లారు.  కొంత కాలంగా అదిరే అభి టీమ్ లో నవీన్ కొనసాగుతున్నారు.  గతంలో వెండితెరపై పలు సినిమాల్లో నటించిన నవీన్ జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అభి స్కిట్ లో నటిస్తున్నాడు.  జబర్ధస్త్ లో అదిరే అభి టీమ్ ద్వారా ఎంతో మంది నటులు పరిచయం అయ్యారు.. తర్వాత టీమ్ లీడర్లుగా ఎదిగారు.  అందులో ఒకరు హైపర్ ఆది.. మొదటి అదిరే అభి స్కిట్ లో నటించిన విషయం తెలిసిందే.  ఓ వైపు వెండితెరపై నటిస్తూనే మరోవైను జబర్ధస్త్ లో కంటిన్యూ అవుతున్నాడు.  

 

తాజాగా జబర్ధస్త్ నటుడు నవీన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన నటులు కృష్ణ .. చిరంజీవి తరువాత నేను ఎక్కువగా అభిమానించే హీరో ఎన్టీఆర్ అన్నారు.  ఎన్టీఆర్ మొదటి సినిమా ‘నిన్ను చూడాలని’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయనని కలిశాను.. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.  సినీ బ్యాగ్ గ్రౌండ్ ఉందన్న గర్వం ఎన్టీఆర్ లో ఏమాత్రం కనిపించలేదు.. ఎంతో సహజంగా అందరితో కలిసిపోయే మనస్థత్వం ఉన్న వ్యక్తిగా అప్పుడే అందరి మనసు గెలిచారు ఎన్టీఆర్.  ఆ తరువాత 'స్టూడెంట్ నెంబర్ వన్','సుబ్బు' , 'సాంబ', 'ఆది' సినిమాల్లో ఆయనతో కలిసి నటించే అవకాశం లభించింది.  

 

దాంతో నాకు ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం పెరిగింది.. కానీ నా హద్దులు ఎప్పుడూ దాటలేదు అన్నారు.  ఎన్టీఆర్ బర్త్ డే రోజున స్నేహితులతో కలిసి ఆయన ఇంటికి వెళ్లాను.  అప్పుడు మా అందరినీ ఇంట్లోకి సాదరంగా ఆహ్వనించారు.  నిజంగా  ఎన్టీఆర్ మంచి మనసున్న వ్యక్తి మాత్రమే కాదు.. తన సహ నటులను ఎంతో ఆప్యాయత చూపిస్తారు. నటన పరంగా,  వ్యక్తిత్వం పరంగా నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: