అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ 20వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో శేషాచలం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. 

 

సినిమా కోసం బన్ని కొత్త లుక్ లో కనిపిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఆ మేకోవర్ లుక్ రెడీ అయినట్టు తెలుస్తుంది. సినిమాలో బన్ని గెడ్డం లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. లేటెస్ట్ గా బన్ని గెడ్డం లుక్ బయటకు వచ్చింది. ఇలా మాసిన గెడ్డంతో బన్ని కనబడటం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ సుకుమార్ సినిమాతో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు. 

 

రంగస్థలం సినిమాతో సంచలన విజయం అందుకున్న సుకుమార్ బన్ని సినిమా అంతకుమించి ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. 19 సినిమాల కెరియర్ లో అల్లు అర్జున్ రఫ్ లుక్ లో కనిపించింది చాలా తక్కువ. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి లుక్ లో మాత్రం బన్ని కొద్దిగా రఫ్ లుక్ తో కనిపించి అలరించాడు. మరి లీకైన ఈ పిక్ సుకుమార్ సినిమా కోసమేనా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లాల్సి ఉండగా కరోనా ఎఫెక్ట్ తో అక్కడ షూటింగ్ పర్మిషన్ ఇవ్వలేదట. అందుకే షూటింగ్ వాయిదా వేసే ఆలోచన లో ఉన్నారు చిత్ర యూనిట్. అల రేంజ్ సక్సెస్ అందుకున్న బన్నిసినిమా ఎఫెక్ట్ ఈ మూవీపై పడకుండా జాగ్రత్తగా ఉన్నాడు. బన్ని, రష్మిక జోడి కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: