దర్శకుడు కావాలని విశాల్ అనుకోలేదు. కాకపోతే పరిస్థితులు ఆయన్ని దర్శకుడిగా మార్చాయి. తప్పరివాలన్ 2 చిత్రంతో దర్శకుడిగా మారాడు. తప్పరివాలన్ తెలుగులో డిక్టేటర్ పేరుతో అనువాదమై ఇక్కడా విజయం సాధించింది. దీంతో సీక్వెల్ ప్లాన్ చేశాడు విశాల్. షూటింగ్ సమయంలో వచ్చిన విభేదాల కారణంగా దర్శకుడు మిస్కిన్ సినిమాను మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు. 

 

దర్శకుడు తప్పుకోవడంతో తప్పరివాలన్ 2 దర్శకత్వ బాధ్యతను విశాల్ తన భుజానికెత్తుకున్నాడు. సిినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా మిస్కిన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో ఓపెన్ లెటర్ ను పోస్ట్ చేశాడు. కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను మధ్యలో వదిలేయడం వల్ల తాను బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు విశాల్. 

 

నిర్మాతలు ఎలా ఉండాలి అనే విషయాన్ని తన లెటర్ లో విశాల్ పేర్కొన్నాడు. దర్శకుడితో సినిమా చేయించుకోవాలి తప్ప ఆయన్ను బతిమిలాడకూడదు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. ఆ దర్శకుడితో పని చేయించుకోకూడదన్నాడు. తప్పిరివాలన్ 2ను విశాల్ సొంతంగా నిర్మిస్తున్నాడు. 

 

తప్పరివాలన్ 2 బడ్జెట్ ను మిస్కిన్ పెంచేశాడు. అనవసరంగా ఖర్చు చేయించడం విశాల్ కు నచ్చలేదు. తప్పరివాలన్ 2ను విదేశాల్లో చిత్రీకరిస్తున్న సమయంలో.. రోజుకు 15లక్షలు నష్టం వచ్చిందని.. ముందస్తు ప్రణాళిక లేకుండా.. షూటింగ్ స్పాట్ లోకి ఎలా వస్తారంటూ మిస్కన్ పై మండిపడ్డాడు. విశాల్ బహిరంగ లేఖపై దర్శకుడు మిస్కిన్ ఎలా స్పందిస్తాడనేది చూడాలి. 

 

విశాల్ కు తమిళనాటే కాదు.. టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు నేచురాలిటీకి దగ్గరగా ఉండటంతో సినిమా థియేటర్లకు క్యూకడతారు జనాలు. డైలాగ్స్, ఫైట్స్ యూత్ ను అట్రాక్ట్ చేసే విధంగా ఉండటంతో విశాల్ పై విపరీతమైన అభిమానం పెంచుకొని ఉంటారు. ఇపుడు ఆయన సినిమాల్లో నటించడమే కాదు.. దర్శకత్వం చేసేందుకు కూడా రెడీ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: