అనుష్క.. ఈమె గురించి తెలియని వారు ఉండరు.. ఎందుకంటే ఈమె నటన ఎంత అద్భుతమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అద్భుతమైన నటన టాలీవుడ్ లో మరో నటికీ ఉండదు అని కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఇకపోతే ఈ అందమైన భామ పెళ్లి అనేది ఎందరో అభిమానుల కల. అసలు పెళ్లి అవుతుందా? అయితే ఎవరితో అవుతుంది? ఎప్పుడు అవుతుంది అని. 

 

ఇంకా ఈ తరహాలోనే ఎందరో అనుష్క పెళ్లి గురించి గాసిప్స్ సృష్టిస్తూనే ఉన్నారు. త్వరలోనే అనుష్క పెళ్లి.. ప్రభాస్ తో పెళ్లి అని.. క్రికెటర్ తో పెళ్లి అని.. వ్యాపారవేత్తతో పెళ్లి అని.. నిర్మాతతో పెళ్లి అని.. చివరికి స్టార్ డైరెక్టర్ కొడుకుతో కూడా పెళ్లి అని వార్తలు వార్తలు రాసి రాసి అనుష్క పెళ్లినా? ఈసారి ఎవరితో అని నవ్వేలా చేసింది మీడియా. 

 

ఇకపోతే మీడియా మరి దారుణంగా వ్యవహరించింది అంటే నమ్మండి. ఎందుకంటే అనుష్క కు ఇప్పటికే 38 ఏళ్ళు వయసు వచ్చేసింది. ఇంకో రెండేళ్లు పోతే 40 ఏళ్ళ వయసులోకి అడుగుపెడుతుంది. అందుకే ఆమె గురించి ఓ రేంజ్ లో వార్తలు వచ్చాయి... వస్తున్నాయ్. అయితే ఈ వార్తలు ఇప్పుడు మాత్రమే కాదు ఎన్నో సంవత్సరాల నుండి ఈ వార్తలు వస్తున్నాయి. 

 

అలానే బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 సూపర్ డూపర్ హిట్ తర్వాత ఈ పెళ్లి గోల మరి దారుణం అయ్యింది. ఆమె బాహుబలి హిట్ తర్వాత ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాకట, కొల్లూరులోని ‘మూకాంబిక’ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆ సమయంలో పెళ్లి గురించే అనుష్క ప్రత్యేక పూజలు జరిపించింది అని ప్రచారం చేశారు. 

 

అయితే ఈ ప్రచారం అనుష్క తండ్రి విఠల్ శెట్టి స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అనుష్క అమ్మవారి భక్తురాలనీ, అప్పుడప్పుడు ఆమె ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటూనే ఉంటుందని ఆయన అన్నారు. దీంతో ఆ వార్తల ప్రచారంపై బ్రేకులు పడ్డాయి. ఏది ఏమైనా అనుష్క పెళ్లి అంటే అందరికి ఉత్సాహమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: