ఒకప్పుడు టెలివిజన్ రంగంలో ఎన్నో కామెడీ సీరియల్స్ వచ్చాయి.. అయితే కొన్ని సీరియల్స్ ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉండేవి. అలాంటి సీరియల్స్ లో అమృతం ఒకటి.  ఇందులు పాత్రలు తక్కువే అయినా ఒక్కో వారం ఒక్కో స్టోరీతో కడుపుబ్బా నవ్వులు పండించే వారు.  ఈ సీరియల్ మొదట శివాజీ, తర్వాత నరేష్ ఆ తర్వాత హర్షవర్థన్ తో సాగింది.  ఏడేళ్లపాటు ఏకధాటిగా ప్రసారమై బుల్లితెరపై సంచలనం సృష్టించిన ‘అమృతం’ తెలుగు ప్రేక్షకులను మరింతగా అలరించడానికి, కాలానికనుగుణమైన మార్పులతో మళ్లీ రానుంది.  19 ఏళ్ళ త‌ర్వాత అమృతంకి సీక్వెల్‌గా అమృతం ద్వితీయం రాబోతుంది. దీనికి మూర్ఖత్వానికి మరణం లేదు అనే క్యాప్షన్ పెట్టారు . ఉగాది సందర్భంగా మార్చి 25 నుండి జీ5లో ప్రసారం కానుంది. 

 

కామెడీ సిరీస్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో అమృత‌రావు, అంజీ, స‌ర్వం పాత్ర‌లు తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచాయి. ఇప్పుడు 19 ఏళ్ళ త‌ర్వాత అమృతంకి సీక్వెల్‌గా అమృతం ద్వితీయం రాబోతుంది. దీనికి మూర్ఖత్వానికి మరణం లేదు అనే క్యాప్షన్ పెట్టారు .  తాజా సిరీస్‌లో హర్షవర్ధన్, శివన్నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి తమ పూర్వ పాత్రలే పోషించగా.. ఎల్బీ శ్రీరామ్ అంజి పాత్రలో, సత్యక్రిష్ణ అమృతం భార్య సంజీవిని పాత్రలో కనబడనున్నారు. కాశీ విశ్వనాథ్, రాఘవ కీలకమైన పాత్రలు పోషించారు. ఈ సారి అమృత విలాస్ ఎలా ఉండ‌బోతుందో చిన్న ట్రైల‌ర్ ద్వారా చూపించారు. 

 

శుక్రవారం (మార్చి 13) యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్ 2 నుండి టాప్ 1కి చేరుకుంది. దీన్ని బట్టి అమృతం పట్ల ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది.  ఉగాది కానుకగా మార్చి 25 నుంచి zee5 లో ‘అమృతం ద్వితీయం’ ప్రసారం కానుంది.. నిజంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘అమృతం’ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దీనికి రెండో ఇన్‌స్టాల్‌మెంట్ కావాలని అభిమానులు కోరుకున్నారు. మొత్తానికి ఈ ఉగాది అమృతం ద్వితీయంను తీసుకొస్తోంది. ఇది నిజంగా అద్వితీయం’’ అని రాజమౌళి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: