టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేసింది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆమెకు ఆఫర్లు ఇచ్చారు. ప్రభాస్ తో రెండు సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆమెకు ఆ వెంటనే అప్పట్లో అవకాశాలు వచ్చాయి. వరుసగా ఫ్లాపులు రావడం తో ఐరెన్ లెగ్ అని కూడా కొందరు కామెంట్ చేసారు. మళ్ళీ ఆ తర్వాత మహేష్ బాబుతో, జూనియర్ ఎన్టీఆర్ తో వరుస హిట్ లు కొట్టింది. ఇక అక్కడి నుంచి పాప కెరీర్ ఊపందుకుంది. 

 

అదే సమయంలో బాలీవుడ్ కి వెళ్ళగా అక్కడి దర్శకులు ఆమెను కాదనలేక అవకాశాలు ఇచ్చారు. అక్కడ ఫ్లాప్ లు ఎదుర్కొని మళ్ళీ టాలీవుడ్ కి వచ్చి నాగ చైతన్య సహా మరికొందరు హీరోలతో హిట్ కొట్టింది. జూనియర్ ఎన్టీఆర్ తో అప్పుడే టెంపర్ సినిమా హిట్ కొట్టి కెరీర్ లో నిలబడింది. అయితే ఈ మధ్య ఈమెకు బాడ్ టైం నడుస్తుంది. సీనియర్ హీరోల పక్కన చేసినా విజయాలు రావడం లేదు. అటు తమిళంలోకి వెళ్ళే ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలించలేదు. అక్కడ కూడా ఆఫర్లు ఇవ్వడానికి ఎవరూ ముందుకి రాలేదు. 

 

ఇప్పుడు ఈమె సోలో గా సినిమాలు చెయ్యాలని చూస్తుంది. ఈ సినిమాలు అంతగా విజయం సాధించలేదు. దీనితో ఇటీవల ఆమెకు అవకాశాలు ఇవ్వాలని భావించిన వాళ్ళే వెనక్కి తగ్గారు. ఆమె మొదటి సినిమా దర్శకుడు ఆమెకు అవకాశం ఇవ్వాలని భావించారు. కాని ఆ అవకాశాన్ని కీర్తి సురేష్ తన్నుకుపోయింది. ఇప్పుడు మళ్ళీ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేసే సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చింది అంటున్నారు. మరి ఆమెకు ఆ సినిమా అయినా నిలబడుతుందో లేదో చూడాలి. చిరంజీవి తో ఆమె ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: