మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లకు కొదవ లేదు. కెరీర్ తొలినాళ్లలో చిరంజీవిగా ఖైదీ తర్వాత డైనమిక్ హీరోగా, పసివాడి ప్రాణం నుంచి సుప్రీం హీరోగా, మరణమృదంగం సినిమా నుంచి మెగాస్టార్ అయిపోయారు. ఖైదీ తర్వాత ఆయన సినీ పయనమే మారిపోయింది. ఆ సినిమా పరంపరలో వచ్చిన సినిమా దొంగ. ఈ సినిమా విడుదలై నేటికి 35 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

ఖైదీ తర్వాత చిరంజీవికి వచ్చిన మాస్ ఇమేజ్ ఆధారంగా వచ్చిన సినిమానే దొంగ. 1985 మార్చి 14న వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. చిరంజీవి లక్కీ డైరక్టర్ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ సెన్సేషన్ కూడా. సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరపరచిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. టైటిల్ సాంగ్ ‘దొంగా.. దొంగ’, 'అందమా.. అలా.. అలా'తో పాటు అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ‘గోలీమార్’ పాట యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ పాట అప్పట్లో మైఖేల్ జాక్సన్ ఆల్బమ్ లోని థ్రిల్లర్ మ్యూజిక్ వీడియోలోని పాట ఆధారంగా తెరకెక్కించారు. అచ్చం మైఖేల్ జాక్సన్ డ్రెస్సింగ్, మేకప్, స్టెప్స్ తో చిరంజీవిలోని డ్యాన్సింగ్ టాలెంట్ ను బేస్ చేసుకుని తీసిన ఈ పాట అప్పట్లో చార్ట్ బస్టర్.

IHG

 

చిరంజీవికి జోడీగా రాధ నటించింది. వీరిద్దరి జోడీలో వచ్చిన హిట్ సినిమాల్లో దొంగ ఒకటి. విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై టి.త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమా శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. వేటూరి సాహిత్యం, పరుచూరి బ్రదర్స్ మాటలు, వీఎస్ఆర్ స్వామి ఫొటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ బ్యానర్ లో చిరంజీవితో తీసిన కొండవీటిదొంగ కూడా శతదినోత్సవ చిత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: