టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోయిన హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. వరుస విజయాలతో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది తమన్నా. టాలీవుడ్ లో ఆమెకు తిరుగులేదు అనుకున్న సమయంలో కొంత మంది హీరోయిన్లు ఆమెను టార్గెట్ చేసారు అనే ప్రచారం జరిగింది. వరుస ఆఫర్లతో ఆమె ఉన్నప్పుడు కాజల్, సమంతా దెబ్బకు ఆమె నిలబడలేక అవస్థలు పడింది అప్పట్లో. అయినా సరే మళ్ళీ కెరీర్ లో నిలబడి అగ్ర హీరోల పక్కన సినిమాలు చేసింది ఈ హీరోయిన్. 

 

ప్రభాస్ తో ఈమె చేసిన బాహుబలి మొదటి భాగం కెరీర్ లో టర్నింగ్ పాయింట్. అయితే ఆ సినిమాలో ఆమెకు అంత గుర్తింపు రాలేదు. ఆమె ఎంత బాగా నటించే ప్రయత్నం చేసినా సరే పెద్దగా అవకాశాలు రాలేదు ఆ తర్వాత. దీనితో అప్పటి నుంచి రెండు మూడు సినిమాల్లో ఆమె ఐటెం సాంగ్స్ ఎక్కువగా చేస్తూ వచ్చింది. వరుస అవకాశాలు రాకపోయినా... ఆమె మాత్రం కెరీర్ లో అగ్ర హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు గోపి చంద్ హీరో గా వస్తున్న సీటి మార్ అనే సినిమాలో నటిస్తుంది.

 

సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ సినిమా. ఈ సినిమాలో గోపి చంద్ కబడ్డీ జట్టు కెప్టెన్ గా నటిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. ఆమె కూడా ఆ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. గోపి చంద్ ఆంధ్రా జట్టు కోచ్ అయితే తమన్నా తెలంగాణ జ‌ట్టు క‌బ‌డ్డీ జ‌ట్టు కోచ్‌ గా నటిస్తున్నట్టు సమాచారం. దీనితో ఆమె తెలంగాణా యాస ను నేర్చుకుంటుంది అంటున్నారు. తెలంగాణా అమ్మాయిగా కనపడటానికి కాస్త ఎక్కువగా కనపడుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: