ఆమె కుటుంబం అంతా సినీ నేపథ్యం.. తాత అమర్ నాథ్ పాత సినిమాలో ఎన్నో కీలక పాత్రల్లో నటించారు.  తండ్రి రాజేష్ హీరో, విలన్ గా నటించారు... ఇక అత్త శ్రీలక్ష్మి కమెడియన్ గా ఒక ట్రెండ్ సృష్టించి 500 పైగా సినిమాల్లో నటించింది. అలాంటి కుటుంబం నుంచి వచ్చింది నటి ఐశ్వర్య రాజేష్.  నటుడు రాజేష్ కూతురైన ఐశ్వర్య రాజేష్ మొదట బుల్లితెరపై తన సత్తా చాటింది. సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే  కామెడీ షోలో ఆమె యాంకర్ గా కెరీర్ ప్రారంభించారు. రియాల్టీ షో మనాడా మయిలాడ గెలుచుకున్న తరువాత, ఆమె అవగాళమ్ ఇవర్గలం నటిగా పరిచయం అయ్యింది. అర్జున్ రాంపాల్ తో కలిసి బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది.

 

తమిళనాడు రాష్ట్రం లో 2014 మూవీ కాకా ముట్టాయికి ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర పురస్కారాన్ని అందుకుంది.  2014 లో విజయ్ సేతుపతితో కలిసి రెండు చిత్రాలు, రమ్మీ మరియుపన్నైరమ్ పద్మినియం అనే రెండు వారాలలో విడుదలైంది.  నటిగా తన కెరీర్ నిలుపుకునేందుకు ఐశ్వర్య రాజేష్ పలు సినిమాల్లో ఆమె తల్లిగా, చెల్లిగా కనిపించారు. ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్ ’ మూవీలో నటించింది ఐశ్వర్యా రాజేష్.  హీరోయిన్ గా పలు సినిమాల్లో ఐశ్వర్య హీరోయిన్‌గా నటించారు.

 

తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె తెలుగు, మలయాళంలో కూడా నటించి అభిమానులను సంపాదించుకున్నారు.  ప్రస్తుతం ఈమెకు ఉన్న క్రేజ్ తో తెలుగు, తమిళ, మళియాళ, కన్నడ భాషల్లో కూడా మంచి ఛాన్సులు వస్తున్నాయి.  అయితే గతంలో అక్క, చెల్లి, తల్లి పాత్రల్లో నటించినప్పటికీ ఇక ముందు తాను అలాంటి పాత్రల్లో నటించబోనని తేల్చి చెప్పేసింది.  ఆ పాత్రల్లో నటించేందుకు కొంత టైమ్ ఉందని అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: