ఇలియానా పరిస్థితి ఇప్పుడు కొంచం అగమ్య గోచరంగా ఉందనే చెప్పాలి. టాలీవుడ్ లో అవకాశాలు రాక బాలీవుడ్ వెళ్లిన అమ్మడు ఇప్పుడు మరో వివాదంలో పడిందట. సైఫ్ ఆలి ఖాన్ తో హ్యాపి ఎండింగ్ సినిమా చేస్తున్న ఇల్లి బేబీ ఆ సినిమాతో సైఫ్ తో మంచి రిలేషన్ ఏర్పడ్డదట.. సైఫ్ ఇలియానా ల మధ్య ఏం లేకపోయినా ఏదో ఉంది అని సృష్టించే మీడియా వారు వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని రభస చేయడం మొదలెట్టారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరకు కరీనా చెవిలో పడింది. విషయం తెలిసి కరీన ఇలియానా మీద గుర్రుగా ఉందని సమాచారం. ఈ విషయం పై చిట్టి నడుము సుందరి ఇలియానా స్పందిస్తూ సైఫ్ కి నాకు మధ్య కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉంది మీరనుకున్నట్లుగా ఏం లేదని చెప్పింది. అయినా సరే కరీన ఇలియానా పై కోపం గా ఉందని చెబుతున్నారు కరీనా సన్నిహితులు. ఎపిహెరాల్డ్.కామ్ కి అందిన సమాచారం ప్రకారం త్వరలో కరీనా డైరెక్ట్ గా ఇలియానాని కలిసి క్లాస్ పీకే స్కెచ్ వేసిందట. ఈలోగా ఇలియానా జాగ్రత్త పడి సైఫ్ కి కొంచం దూరం గా ఉంటే మంచిది లేకపోతే లోకం లో ఇంతమంది మగాళ్లు ఉంటే నీకు నా మొడుగే కావాల్సి వచ్చాడా అని కరీనా ఇల్లి బేబి ని అడగక తప్పదు. సో ఏది ఏమైనా ఈ మ్యాటర్ కి ముగింపు పలికితే బీ టౌన్ హాట్ న్యూస్ కి బ్రేక్ పడ్డట్లే. సైఫ్ తో ఇలియానా రిలేషన్ నిజమేనంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: