జబర్ధస్త్ లో ఇప్పటి వరకు ఎంతో మంది నటులు పరిచయం అయ్యారు. అలా పరిచయం అయిన వారిలో వెండితెరపై వెలిగిపోతున్నారు. వేణు, ధన్ రాజ్, తాగుబోతు రమేష్ ఇలా ఎంతో మంది నటులు వెండితెరపై సత్తా చాటుతున్నారు.  ఆ తర్వాత చమ్మక్ చంద్ర, రాకేష్ రాఘవ, సుదీర్ టీమ్ వీరు కూడా వెండితెరపై కనిపిస్తున్నారు. ఇక బుల్లితెరపై జబర్ధస్త ఏడేళ్లుగా సాతుగుంది.  జబర్ధస్త్ లో చమ్మక్ చంద్ర టీమ్ లో అప్పట్లో మగవారు ఆడవారి వేషం వేసుకొని నటించారు.  చాలా కాలం తర్వాత ఓ నటి చమ్మక్ చంద్రతో నటిస్తుంది. ఇటీవల చమ్మక్ చంద్ర జబర్ధస్త్ ని వదిలేి వేసి అదిరిందిలో కి వెళ్లారు.  కానీ   ఇప్పటికీ ఎప్పటికీ చంద్ర అంటే కేరాఫ్ జబర్దస్త్ అంటారు అభిమానులు.

 

ఇక ఈ షోలో ఎక్కువగా అబ్బాయిలే కనిపిస్తుంటారు. అమ్మాయిలు చేయలేక కాదు కానీ ఎక్కువగా ఒకర్ని ఒకరు ముట్టుకోవడం ఉంటుంది కాబట్టి అమ్మాయిలను తీసుకోవడం మంచిది కాదని చెప్పారు అప్పట్లో ఈ నటులంతా.  గత ఐదేళ్లుగా అదే టీంలో ఆయనతో పాటే స్టేజీపై కామెడీ చేస్తుంది ఓ అమ్మాయి. ఆమె కామెడీకి కడుపులు చెక్కలయ్యేలా నవ్వుకుంటారు ఆడియన్స్. చంద్ర టీంలో చేసే అమ్మాయి గురించి బయట కూడా అరుదుగా తెలుసు.

 

అమ్మాయి పేరు సత్య శ్రీ.. కొన్నేళ్లుగా చంద్ర టీంలోనే రెగ్యులర్‌గా చేస్తుంది.దాంతో పాటే సినిమాలు కూడా చేసింది కానీ సత్య గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే ఈ అమ్మడు బుల్లితెరపైనే కాదు.. వెండి తెరపై కూడా సత్తా చాటింది.  రాజా ది గ్రేట్, ఆర్‌డిఎక్స్ లవ్ లాంటి సినిమాల్లో కూడా నటించినా సత్యకు గుర్తింపు మాత్రం రాలేదు. అయితే జబర్దస్త్ పుణ్యమా అని అక్కడ మాత్రం బాగానే బిజీ అయిపోయింది. ఇప్పుడు చంద్రతో పాటే సత్య కూడా జీ తెలుగుకు వెళ్లిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: