మెగాస్టార్ చిరంజీవికి అందరూ మిత్రులే. ప్రత్యేకించి ఇప్పటితరం హీరోలు కూడా ఆయనతో సన్నిహితంగా ఉంటారు. చిరంజీవి కూడా అందరితో కలసిమెలసి ఉండేలా చూసుకుంటారు. ఎవరి వద్ద ఇగోలు ప్రదర్శించరు. ఓ విధంగా టాలీవుడ్లో అందరివాడు అన్న పేరును చిరంజీవి నిలబెట్టుకుంటున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్యకి కూడా చిరంజీవి మంచి మిత్రుడు అన్న సంగతి తెలిసిందే. బాలయ్యే ఆ సంగతిని అనేకసార్లు చెప్పుకొచ్చాడు. తనకు  చిరంజీవి తప్ప గొప్ప  మిత్రుడు వేరే ఎవరూ లేరని బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అటువంటి చిరంజీవి బాలయ్యలది ఆరోగ్యకరమైన పోటీ. ఈ ఇద్దరు హీరోలు అనేకసార్లు తలపడ్డారు. 

 

సినిమాల ద్వారానే ఆ పోటీ జరిగింది. ఇద్దరు హీరోలూ సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేసి ఢీ అంటే ఢీ కొట్టారు. కొన్నిసార్లు చిరంజీవిది  పై చేయి అయితే మరికొన్ని సార్లు బాలయ్యది పై చేయిగా ఉంటూ వచ్చింది. ఇక ఈ ఇద్దరు హీరోలు   చివరిసారిగా  2017లో సంక్రాంతికి పోటీ పడ్డారు. చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీతో బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి పోటీగా వచ్చింది. రెండూ విజయం సాధించాయి.

 

ఇప్పుడు మరో సారి ఈ ఇద్దరి హీరోల మధ్య స్టార్ వార్ జరగబోతోందని అంటున్నారు. ఈ దసరాకు బాలయ్య, బోయపాటి మూవీ వస్తుందని టాక్. ఎందుకంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ మూవీ వస్తుంది. దాంతో ముందుగానే సినిమాను రిలీజ్ కి కొట్టాలని బోయపాటి ఆలోచిస్తున్నాడుట. మరో వైపు బాలయ్య కూడా హిట్ కోసం తపిస్తున్నాడు. దాంతో ఈ కాంబో మూవీ దసరాకు  కచ్చితంగా వస్తుందని అంటున్నారు.

 

ఇంకోవైపు చూసుకుంటే మెగాస్టార్ కొరటాల మూవీ ఆచార్య కూడా దసరా బరిలో ఉంటుందని అంటున్నారు. వారిదీ అదే సమస్య. ఆర్.ఆర్.ఆర్ మూవీకి ఎదురెళ్ళకూడదని చిరు దసరాకే ప్లాన్ చేస్తున్నాడు. దాంతో ఇపుడు బాలయ్య చిరు పోటీ తప్పడంలేదని అంటున్నారు. నిజానికి ఈ రెండు సినిమాలు సమ్మర్ కి, ఆగస్ట్ కి రావాలి. కానీ అనుకోని లేట్ వల్ల ఇపుడు ఒకేసారి రావాల్సివస్తోందట. అదే జరిగితే ఇద్దరు సీనియర్ల మధ్య మరో బిగ్ ఫైట్ ఖాయమని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: