పెళ్లి తర్వాత లైఫ్ మన చేతిలో ఉండదు అంటారు. అంతేగా అనే డైలాగ్ చెప్పుకోవడం తప్ప ఏం చేయలేరు అని వెంకటేశ్ కూడా చెప్పాడు. అయితే పెళ్లి తర్వాత లైఫే కాదు.. పెళ్లి వేడుకలు కూడా మీ చేతుల్లో ఉండవు అంటోంది కరోనా. కరీనాలా అందమైన పేరున్న ఈ వైరస్ దెబ్బకు నితిన్ వెడ్డింగ్ లొకేషన్ మారుతోందట. 

 

నితిన్ చాలా లేట్ గా పెళ్లి చేసుకుంటున్నా.. పెళ్లి వేడుకలు మాత్రం లైఫ్ టైమ్ మెమరీగా నిలిచిపోవాలనుకున్నాడు. అందుకే దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నాడు. ఏప్రిల్ 16న దుబాయ్ లో రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ కరోనా ఎఫెక్ట్ తో నితిన్ ప్లాన్స్ మారిపోతున్నాయట. 

 

కరోనా వైరస్ దెబ్బకు జేమ్స్ బాండ్ కూడా వెనక్కి వెళ్లిపోయాడు. చాలామంది స్టార్లు షూటింగ్ లు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఆడియో ఫంక్షన్ లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పర్మీషన్లు రావట్లేదు. ఈ జాబితాలోనే నితిన్ పెళ్లి కూడా చేరుతోంది. కరోనా కాలంలో దుబాయ్ వెళ్లడం రిస్క్ అనుకుంటోందట నితిన్ ఫ్యామిలీ. 

 

దుబాయ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్స్ ని పక్కన పెట్టేసి, హైదరాబాద్ లోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట నితిన్. ఏప్రిల్ 16న హైదరాబాద్ లోనే ఏడడుగులు వేసేందుకు వేదికని సిద్ధం చేయిస్తున్నాడట. ఇక ఏప్రిల్ 21న రిసెప్షన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. 

 

మొత్తానికి యంగ్ హీరో నితిన్ చాలా లేట్ గా పెళ్లి చేసుకుంటుంటే.. కరోనా భయపెట్టడం కొంత డిసప్పాయింట్ కు గురించేసింది. ప్రేమించి పెళ్లాడుతున్న ఆయనకు ఈ వైరస్ నిరుత్సాహానికి గురిచేసింది. దుబాయ్ లో అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలని నితిన్ కన్న కలలు కల్లలయ్యాయి. మరి ఈ హీరో తర్వాతి ప్లాన్ ఏంటనే సందేహం ఆయన ఫ్యాన్స్ లో నెలకొంది. . పెళ్లి తంతు హైదరాబాద్ లోనే కానిస్తాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: