కరోనా వైరస్  ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలను బతికుంటూ  అందరినీ ప్రాణభయంతో వణికిస్తోంది. ఇక ప్రపంచ దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతూ ఈ వైరస్ ప్రతాపం చూపిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇక దేని గురించైనా ఎక్కువమంది చర్చించుకుంటున్నారు అంటే దానికి సంబంధించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది అనే విషయం తెలిసిందే. అంతేకాదు ఎంతో మంది దానిని బేస్ చేసుకుని కామెడీని కూడా సృష్టిస్తూ ఉంటారు. ప్రస్తుతం జబర్దస్త్ లో కూడా ఇదే జరిగింది. ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక జబర్దస్త్ ప్రోగ్రాం హైపర్ ఆది స్కిట్ వస్తుందంటే ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆది స్కిట్ లో అన్ని పంచ్ లు  ఉంటాయి మరి. 

 

 

 ఈ నేపథ్యంలో ఆది  ఎప్పుడూ సరికొత్త కామెడీ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం అందరి నోళ్లలో నానుతున్న కరోనా వైరస్ ను కూడా తన కామెడీ స్కిట్ లో ఇన్వాల్వ్ చేసేసాడు. కరోనా తో కామెడీ పుట్టిస్తున్నాడు . కరోనా  వైరస్ పుణ్యమా అని వీరికి మంచి పంచులు కూడా దొరికాయి. ప్రపంచం మొత్తం కరోనా వైరస్  పేరు ఎత్తితే వణికిపోతుంటే... అదే కరోనా  వైరస్ పేరు చెప్పి అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నారు హైపర్ ఆది. కేవలం హైపర్ ఆది మాత్రమే కాదు వివిధ కమెడియన్లు కూడా కరోనా వైరస్  జోకులు పేల్చుతున్నారు. సునామీ సుధాకర్ పై  జబర్దస్త్ బుడ్డోడు నరేష్ కరోనా  వైరస్ జోకులు పేల్చాడు. 

 

 

 వీడి పేస్ చూస్తే కరోనా  వైరస్ కూడా కడుపు పగిలి చచ్చిపోతుంది అంటూ సెటైర్లు వేసాడు. మరోవైపు హైపర్ ఆది కూడా తన టీం మెంబర్స్ ని కరోనా వైరస్ తో పోలుస్తూ పంచులు వేశాడు. దీంతో చాలామంది కమెడియన్లు కరోనా  వైరస్ పై  ఎన్నో జోకులు పేలుస్తున్నారు. ఇది కేవలం జబర్దస్త్ లోనే కాదు అటు జీ తెలుగు లో ప్రసారమయ్యే అదిరింది షోలో  కూడా కొనసాగుతోంది. అక్కడ కరోనా అంటే పెద్ద ఫిగరా  అంటూ సద్దాం హుస్సేన్ కరోనా  వైరస్ పై  జోకులు పేలుస్తున్నాడు. ఏదేమైనా కరోనా  వైరస్ అందరిని భయపెట్టడమే కాదు ఎంతోమందిని కడుపుబ్బ నవ్విస్తుంది కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: