ప్రస్తుతం టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్. యువ సంచలన హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగులో నటి ఛార్మి తో కలిసి పూరి తన పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ హిందీ లో ఈ సినిమాని ఎంతో భారీ రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా విషయమై నేడు పలు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. 
 
అదేమిటంటే, ముందుగా కొన్నేళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేని పూరి, ఇటీవల యంగ్ హీరో రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. అయితే ఆ సినిమా తరువాత ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెస్తున్న ఈ సినిమాని ఎంతో భారీ ఖర్చుతో తీస్తుండడంతో, పూరి దీనిని ఎంతవరకు ఆకట్టుకునేలా తెరకెక్కించగలరు, అలానే తెలుగుతో పాటు మిగతా ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా, అసలు సక్సెస్ సాధిస్తుందా లేదా అనే అనుమానాలు కొందరు నెటిజన్లు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ విషయం పూరి వరకు చేరడంతో, ఈ విషయమై ఆయన కొంత సీరియస్ అయినట్లు సమాచారం. 
 
 
తనకు టాలీవుడ్ లో 30 సినిమాలకు పైగా దర్శకుడిగా అనుభవం ఉందని, అలానే పలువురు అగ్రనటులకు మంచి హిట్స్ అందించిన తనకు, ప్రస్తుతం విజయ్ తో తీస్తున్న ఫైటర్ ఎలా తీయాలో తనకు ఎవరూ చెప్పాల్సిన పని లేదని, అలానే అది పాన్ ఇండియా మూవీ అని పదే పదే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని ఆయన తన సన్నిహితుల వద్ద నిరాసక్తత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే దర్శకుడిగా పూరికి అపార ఆనుభవం ఉందని, అటువంటి దర్శకుడిని ఇది పాన్ ఇండియా మూవీ, దీనిని మీరు జాగ్రత్తగా తీయండి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, తప్పకుండా ఆయన థీస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ కొట్టి, దర్శకుడిగా పూరికి, హీరోగా విజయ్ కు సూపర్ హిట్ ని అందించడం ఖాయం అని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: