ఆరెక్స్ 100 సినిమాతో హీరోగా లైం లైట్ లోకి వచ్చిన కార్తికేయ ఆ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. వరుస సినిమాలు చేస్తున్నా సరే ఈమధ్య హిట్టు కొట్టడంలో వెనుకపడ్డ కార్తికేయ అంటే లేడీ ఫ్యాన్స్ లో కూడా ఫాలోయింగ్ పెరిగింది. తెలుగులోనే కాదు మనోడికి కన్నడలో ఫ్యాన్స్ ఉన్నారు. కన్నడలో సీరియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రక్ష గౌడ ఈమధ్య తెలుగులో ఆఫర్లు అందుకుంటుంది. తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలకు సైన్ చేసింది ఈ అమ్మడు.

 

ఇక ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తనకు ఆరెక్స్ 100 కార్తికేయ అంటే ఇస్తామని అతని ఫిజిక్ చాలా బాగుటుందని.. ఆరెక్స్ 100 లో అతని నటనకు తను ఫిదా అయ్యానని చెప్పుకొచ్చింది. ఛాన్స్ దొరికితే కార్తికేయ పక్కన జోడీ కట్టేందుకు రెడీ అని ఆరాటపడుతుంది రక్ష గౌడ. కార్తికేయలో అంతగా ఏం చూసిందో ఏమో కానీ అమ్మడు మాత్రం కార్తికేయ పేరు వినిపిస్తే చాలు హడావిడి చేస్తుంది. ప్రసుతం ఫోటో గ్రాఫర్ పండు సినిమాతో పాటుగా ఓకే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న రక్ష గౌడ కార్టియేక సినిమా ఛాన్స్ రావాలె కానీ కథ కూడా అడగకుండా చేస్తానని అంటుంది.

 

ఇక కార్తికేయ కూడా తనకు వచ్చిన ఈ ఇమేజ్ ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.  ప్రస్తుతం చావు కబురు చల్లగా సినిమాలో నటిస్తున్నాడు కార్తికేయ. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాతో అయినా కార్తికేయ తన సత్తా చాటుతాడేమో చూడాలి. హీరోగానే కాదు విలన్ గా కూడా సత్తా చాటుతున్నాడు కార్తికేయ. తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నడిచిన కార్తికేయ తమిళంలో అజిత్ హీరోగా వస్తున్నా సినిమాలో కూడా విలన్ గా ఛాన్స్ కొట్టేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: