సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది.  ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.  హీరో, హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలు భిన్న కోణాల్లో ఆవిష్కరిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మాకు సంబంధం లేదు మొర్రో అని వివరణ ఇచ్చుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో సూపర్ మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయిన బెంగుళూరు బ్యూటీ అనుష్క తర్వాత స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం మూవీలో నటిస్తుంది.  అయితే అనుష్కపై ఇప్పటి వరకు ఎన్ని రూమర్లు వచ్చాయో... వస్తున్నాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  మీడియాలో అనుష్క పెళ్లిని మించిన ఎంటర్‌టైనింగ్ టాపిక్ మరోటి ఉండదు.

 

తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్ట‌ని టాపిక్ ఇది. గతంలో ఈ విషయంపై నాకు ఎన్ని సార్లు పెళ్లి చేస్తారు.. ఎంత మందితో పెళ్లి చేస్తారో అని సెటైర్ వేసింది అనుష్క.  అయితే ఈ మద్య కొత్త పుకార్లు పుట్టుకు వచ్చాయి.. ఓ క్రీడాకారుడితో అనుష్క పెళ్లి ఫిక్స్ అయ్యిందని త్వరలో పెళ్లి కూడా చేసుకోబుతుందని వార్తలు వచ్చాయి. ఇక ప్రభాస్ తో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బిల్లా తర్వాత మిర్చి, బాహుబలి, బాహుబలి 2 లో ఈ జంట కలిసి నటించారు. అప్పటి నుంచి అనుష్క హీరో ప్రభాస్ తో డేటింగ్ లో ఉందని.. త్వరలో వీరి పెళ్లి కూడా జరగబోతుందని వార్తలు వచ్చాయి.   

 

మా మద్య ఎప్పటికీ స్నేహం మాత్రమే ఉంది.. ఎలాంటి ఎఫైర్ లేదు అని క్లారిటీ ఇచ్చారు.   ఇక ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాశ్ తో పెళ్లని ఈ మద్య కొత్తగా రూమర్లు వచ్చాయి.  దీనిపై అలాంటిదేం లేదు.. అతడితో నాకు పెళ్లేంటి అని సమాధానమిచ్చింది. పెళ్లి చేసుకుంటే చెప్పే చేసుకుంటానంటూ క్లారిటీ ఇచ్చింది. దీనిపై అనుష్క చాలా సీరియస్‌గా స్పందించిందని తెలుస్తుంది. నా పెళ్లిపై క్యూరియాసిటీ వద్దు.. ఏం జరిగినా ఫస్ట్ మీడియాకు చెప్పే పెళ్లి చేసుకుంటా అంటుంది ఈ బొమ్మాళి. 

మరింత సమాచారం తెలుసుకోండి: