హీరోయిన్స్ మీద లైంగిక దాడుల వ్యవహారం ఇంకా ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. కొందరు బయటకు వచ్చి స్వతంత్రంగా మీటూ అంటూ  చెబుతుంటే మరికొందరు మాత్రం ఇంకా ఎందుకో వెనక్కి తగ్గుతున్నారు. లేటెస్ట్ గా నిర్మాతలతో పడుకుంటేనే ఛాన్సులు వస్తాయ్.. దానికి ఓకే అంటేనే ఛాన్స్ ఇస్తారు లేదంటే అవకాశాలు ఇవ్వరంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ వాణి  భోజన్.

 

కోలీవుడ్ లో అప్ కమింగ్ హీరోయిన్ గా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం వైభవ్ నటిస్తున్న లాకప్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా తమిళంలో వచ్చిన ఓ మై కడవలె సినిమాతో సక్సెస్ అందుకున్న వాణి సీరియల్ స్టార్ గా కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. మాయ సీరియల్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు అందుకుంది.

 

మాయ తర్వాతే తను మేనేజర్ ను పెట్టుకుని సినిమా చాన్సులే కోసం ఎదురుచూశానని.. కొందరు అవకాశం ఇస్తామని చెప్పి వాళ్ళతో పడుకుంటేనే అంటూ చిన్నగా చెబుతారని.. ఆ నిర్మాతలు ఎవరో తానూ చెప్పలేనని అంటుంది వాణి. అంతేకాదు అప్పుడు నిర్మాతలు ఇచ్చిన ఆఫర్ కు తలొగ్గి ఒకసారి అలా చేస్తే ఇక ప్రతిసారి అవకాశం కోసం అలా చేయాల్సి వస్తుందని. తన విషయంలో మాత్రం ఛాన్సులు వచ్చినా రాకున్నా అలాంటి పనులు మాత్రం చేసేది లేదని అంటుంది వాణి భోజన్. అయితే వాణి భోజన్ తమిళ నిర్మాతల మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్ లో సంచలనంగా మారాయి. వాళ్ళ పేరు కూడా బయట పెట్టాలని కొందరు ఆమెను ప్రెజర్ చేస్తున్నారు.  కేవలం తమిళంలో సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఈ అమ్మడు తెలుగులో కూడా అవకాశం వస్తే చేస్తా అని చెబుతుంది. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: