ముఖ్యమంత్రి కావడానికి తాను రాజకీయలలోకి రాలేదని పదేపదే పవన్  తన ఉపన్యాసాలలో చెపుతూ ఉంటాడు. అయితే రాజ‌కీయాలలో మార్పు తీసుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలి అంటే తనకు అధికారం అవసరం అంటూ పవన్ గత ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వెళ్ళాడు. 

 

అయితే పవన్ చెప్పిన విషయాలలో ప్రజలకు సరైన క్లారిటీ లభించక పోవడంతో పవన్ కు 7 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. అయినా తన పట్టుదల వీడకుండా తన వ్యూహాలు మారుస్తూ పవన్ తన జనసేన ని అందరికీ దగ్గర చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమాల వైపు యూటర్న్ తీసుకుని వరస పెట్టి సినిమాలు చేస్తున్న పవన్ వచ్చే ఏడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.

 

ఇప్పుడు ఈ వార్తలకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. గతంలో పూరీ మహేష్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసిన ‘జన గణ మన’ మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి వ్రాసిన కథ ఇప్పుడు మార్పులు చేసి పూరీ పవన్ తో తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటున్నారు. 


ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని పూరీ తన మార్క్ స్టైల్ లో ఈ కథకు పవన్ కు నప్పే విధంగా అనేక మార్పులు చేసినట్లు టాక్. ఈ కథ లైన్ పవన్ కు బాగా నచ్చడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న ప్రచారం కూడ జరుగుతోంది. ఈ మూవీ కథ రీత్యా పవన్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని టాక్. పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కన్న అభిమానుల కోర్కెను పూరీ ఇలా తీరుస్తున్నాడు అనుకోవాలి. గతంలో ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ మూవీ తరువాత పూరీ పవన్ ఘాటుగా విమర్శిస్తూ కామెంట్స్ కూడ చేసాడు. అయితే ఇవన్నీ మర్చిపోయి రాజకీయాలలో సినిమాలలో శాశ్విత శతృవులు మిత్రులు ఉండరు అన్న విషయాన్ని పూరీ పవన్ లు మరొకసారి రుజువు చేయబోతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: