ఇటీవ‌ల బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేసేందుకు, ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను ఆక‌ర్షించేందుకు కొత్త కొత్త సీరియ‌ల్స్ ప్రారంభ‌మ‌వుతున్నాయి. సంవ‌త్స‌రాల పాటు సీరియ‌ల్స్ కంటిన్యూ అవుతున్నా వాటి క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. అందులో మాటీవీలో వచ్చే కార్తీకదీపం సీరియల్ కూడా ఒక‌టి. ప్రస్తుతం మన తెలుగులో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఛానెల్స్ లో భారీ స్థాయి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక ఛానెల్ ఏదన్నా ఉంది అంటే అది స్టార్ మా అని చెప్పాలి. అందుకు ప్ర‌ధాన కార‌ణం.. ఈ ఛానెల్ లో ప్రసారం అయ్యే కార్తీకదీపం సీరియ‌ల్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ తిరుగులేని టీఆర్పీ రేటింగ్ లతో దూసుకుపోతున్న సీరియల్ కార్తీక దీపం. 

 

ప్రతిరోజూ కొత్త మలుపులతో.. ఇంటిల్లపాదికి వినోదాన్ని పంచుతున్న కార్తీకదీపం సీరియల్ ఇప్పటి వరకూ 755 వ ఎపిసోడ్ కు చేరుకున్న కార్తీకదీపం సీరియల్ మరింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇక‌ కార్తీకదీపం సీరియల్ లోని దీప అలియాస్ వంటలక్క అంటే ఇష్టపడని వారూ ఉండ‌రు. సీరియల్ లో తన నటనతో కన్నీళ్లు పెట్టించే దీపకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈమె క్యారెక్టర్ కోసమే చాలామంది మహిళలు ఈ సీరియల్ చూస్తున్నారు అని చెప్పొచ్చు.

 

అంతేకాకుండా దీపగా, వంటలక్కగా నటి ప్రేమి విశ్వనాథ్ ప్రతీ మహిళను కదిలించే విధంగా నటించింది. ఆమె నటనే సీరియల్‌కు ప్రధాన ఆకర్షణ. అనుబంధాలు.. అనుమానాల మధ్య నలిగిపోయిన భార్యాభర్తలు.. విడివిడిగా ఉంటున్న తల్లి దండ్రుల మధ్య నలిగిపోతున్న పిల్లలు.. మంచిని చేడుగా మర్చగలిగే చెప్పుడుమాటలు చేసే అపకారం అన్నిటినీ కలబోసి అందిస్తోంది కార్తీక దీపం. మానవ బంధాల మధ్య ఉండే సున్నిత విషయాలను చక్కగా చూపిస్తున్న కార్తీక దీపం. ఇక ఈ వారం కూడా బుల్లితెర టాప్ రేటింగ్ సీరియ‌ల్‌గా కార్తీక‌దీప‌మే నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: