అనుష్క సినిమా ప్రస్థానం మొదలై 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ టాప్ హీరోలకు ఆమె ట్యాగ్ లు ఇచ్చింది. చిరంజీవి తన దృష్టిలో తిరుగు లేని లెజెండ్ అని చెపుతూ సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి మంచి వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరు లేరు అని అంటోంది.


అనుక్షణం ఉత్సాహం ఉత్తేజం తో కనిపించే మంచి వ్యక్తి బాలకృష్ణ అయితే తన మనసుకు బాగా దగ్గర అయిన వ్యక్తి నాగార్జున అని కామెంట్ చేసింది. వెంకటేష్ మాత్రం ఎప్పుడు స్టార్ హీరోల తనకు కనిపించడని ఒక మంచి వ్యక్తిగా మాత్రమే తనకు కనిపిస్తాడు అంటూ అభిప్రాయపడింది. 


ఇక రవితేజా తో పని చేస్తే ఎవరికైనా జీవితంలో బోర్ అనేది ఉండదు అంటూ జోక్ చేసింది. సినిమాలను ఒక ప్రోఫెషనల్ గా భావిస్తూ సినిమాలు వేరు జీవితం వేరు అన్న విషయం తాను మహేష్ నుంచి నేర్చుకున్నాను అని అంటోంది. ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అతడి హార్డ్ వర్క్ అతడి సక్సస్ కారణం అని చెపుతోంది.


ఇండస్ట్రీలో ఎంతమంది వ్యక్తులు ఉన్నా నైస్ హ్యూమన్ బీయింగ్ అనే పదానికి సూర్య చిరునామా అంటూ తమిళ హీరో మాధవన్ లాంటి అపారమైన నాలెడ్జి ఉన్న వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదు అని అంటోంది. ఇదే సందర్భంలో రానా గురించి మాట్లాడుతూ రానా తనకు బ్రదర్ అని అంటూ రానా కూడ తనను ‘బ్రో’ అని పిలుస్తాడు అని చెప్పింది. ఇక చివరిగా ప్రభాస్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెపుతూ ప్రభాస్ తనకు ఒక హీరోలా కాకుండా తన ఇంటి సభ్యుడుగా అనిపిస్తాడు అంటూ కామెంట్ చేసింది. ఇలా అందరి గురించి కామెంట్స్ చేసిన అనుష్క మాత్రం పవన్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి ఏమాత్రం తన అభిప్రాయలు వెల్లడించక పోవడం ఆమె ట్విస్ట్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: